వేసవిలో తక్కువ ఖర్చుతో...మిద్దె తోటల సంరక్షణ

వేసవిలో తక్కువ ఖర్చుతో...మిద్దె తోటల సంరక్షణ
x
Highlights

ఎండలు పెరిగిపోయాయి. ఏప్రిల్‌, మే నెలల్లో సూర్య ప్రతాపం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మనుషులే ఈ ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు...

ఎండలు పెరిగిపోయాయి. ఏప్రిల్‌, మే నెలల్లో సూర్య ప్రతాపం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మనుషులే ఈ ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు అలాంటిది మొక్కల పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు వేసవిలో ఎండలే కాదు నీటి సమస్య నగరవాసులను వేధిస్తుంటుంది మనుషులకే నీరు సరిపోవడం లేదు ఇలాంటి సమయంలో మొక్కలను ఎక్కడ పెంచగలమని చాలా మంది చేతులెత్తేస్తుంటారు. మిద్దె తోటలను నిర్వహించేవారికి ఈ వేసవి సవాల్ తో కూడుకున్నది అందుకే వేసవి సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల తక్కువ ఖర్చుతో మొక్కలను సంరక్షించుకోవచ్చో తెలుసుకుందాం.

చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే వేసవిలో సమర్థవంతంగా మిద్దెతోటలను నిర్వహించుకోవచ్చంటున్నారు మిద్దెతోటల సాగుదారు వెంకటకృష్ణ. ఇందుకోసం నాలుగు పద్ధతులను అనుసరించాలంటున్నారు. నీటిని ఆదా చేసుకునేందుకు మిద్దె తోటల సాగులో డ్రిఫ్ పద్ధతిని పాటించాలంటున్నారు . ఈ విధానంలో అతి తక్కువ నీటితో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చంటున్నారు. అంతేకాదు ఎండ తీవ్రత నుంచి మొక్కలను కాపాడుకునేందుకు షేడ్‌నెట్‌ను వినియోగించాలంటున్నారు. పాలేకర్ సిద్ధాంతాలను అనుసరించి సహజ ఆచ్ఛాదన చర్యలు కుండీల్లో చేపట్టాలని అదే విధంగా మొక్కల్లో వేడిని పెంచని ప్రకృతి సిద్ధమైన ఎరువులను అందించాలంటున్నారు.

వేసవిలో ఎండల నుంచి మొక్కలను రక్షించడం మాత్రమే కాదు తరువాతి కాలానికి పనికివచ్చే విత్తనాలను సేకరించుకోవాలంటున్నారు వెంకట కృష్ణ. మిద్దె తోటల సాగుకు అవసరమయ్యే విత్తనాలను మార్కెట్‌ల నుంచి విక్రయించకుండా సహజంగా తోటలోని కాయల నుంచే సేకరించాలంటున్నారు. సేకరించిన విత్తనాలను మడులలో వేసుకుని ,నారును సిద్ధం చేసుకుని, ఆ నారునుంచే మొక్కలను తయారు చేసుకుని వాటి నుంచి వచ్చే ఉత్పత్తులను స్వీకరించాలని చెబుతున్నారు. మిద్దె రైతు ఎవరిమీద ఆధారపడకుండా సాగు పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories