మిద్దెతోటల సాగులో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి

మిద్దెతోటల సాగులో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి
x
Highlights

మిద్దెతోట ఇంటిల్లిపాదికి సంవత్స రం పొడవునా తాజా కూరగాయలు, పండ్లు, పూలు ఇస్తుంది. ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుంది. యాంత్రిక జీవనంతో దూరమైన మానసిక...

మిద్దెతోట ఇంటిల్లిపాదికి సంవత్స రం పొడవునా తాజా కూరగాయలు, పండ్లు, పూలు ఇస్తుంది. ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుంది. యాంత్రిక జీవనంతో దూరమైన మానసిక ఉల్లాసాన్ని తిరిగి తెస్తుంది. అన్నిటికి మించి ప్రకృతితో స్నేహం నేర్పిస్తుంది. తద్వారా కోల్పోయిన జీవన మాధుర్యాన్ని అందిస్తుంది. సృజనాత్మకతను పెంచుతూ, మంచి ఆలోచనలు పురుడుపోసుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తుంది మిద్దెతోట.

హైదరాబాద్ , కాప్రా ఎల్లారెడ్డి గూడ, హైటెక్ నగర్ కాలనీ చెందిన సాంబశివుడు రైల్వే హ్యూమన్ రిసోర్సెస్ సీనియర్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ఈయన స్వగ్రామం వేములవాడ అయినా గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈయనకు మొదటి నుంచి మొక్కల మీద మమకారం ఎక్కువ అందుకే గత 10 పది సంవత్సరాలుగా మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. తాను ఇంట్లో మిద్దె తోటలను సాగు చేయడమే కాదు తమ కాలనీ వాసులకు మిద్దె తోటలపై అవగాహన పెంచుతూ వారిని మిద్దె తోటల సాగుకు ప్రోత్సహిస్తున్నారు.

మిద్దె తోటలో సుమారు 30 నుంచి 40 రకాల మొక్కలను పెంచుతున్నారు. స్థానికంగా లభించేవే కాకుండా విదేశీ కూరగాయలను సాగు చేస్తున్నారు. దీనితో పాటే ఖాదర్ వలీ సూచించిన కషాయాలను దృష్టిలో పెట్టుకుని ఔషధ మొక్కలను పెంచుతున్నారు. తన తోటలో ఏ మొక్కను పెంచినా అందులో ఉన్న పోషకవిలువలకు ఈయన ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. వాటినే పండిస్తుంటారు.

అరగంట సేపు మిద్దె తోటలో సమయం గడిపితే వ్యాయామాలు చేయాల్సిన పని లేదు జిమ్ములకు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం రాదంటున్నారు ఈయన. అంతేకాదు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయంటున్నారు. రానున్న కాలంలో కూరగాయల కొరత అధికంగా ఉంటుందని పౌష్టిక ఆహారం దొరికే పరిస్థితి ఉండదంటున్నారు అందుకే అర్బన్ ఫార్మర్స్ పెరగాలని మిద్దెల మీద పంటలు పండించుకోవాలంటున్నారు సాంబశివుడు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి మిద్దెతోటలు మంచి మాధ్యమం అని అంటున్నారు ఈయన.

మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటిని తన ఇంటి కిచెన్ నుంచి వచ్చే వేస్ట్‌తోనే తయారు చేసుకుంటున్నారు. కిచెన్ వేస్ట్‌తో తయారైన కంపోస్ట్ ఎరువులనే మిద్దె తోటలకు అందిస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువును చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని అంటున్నారు సాంబశివుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories