స్ట్రాబెర్రీ సాగులో సిరుల పంట పండిస్తున్న మన్యం రైతు

స్ట్రాబెర్రీ సాగులో సిరుల పంట పండిస్తున్న మన్యం రైతు
x
Highlights

ఎర్రని రంగు ఆకుపచ్చని తొడిమతో హ్రుదయాకారంలో వుండే స్ట్రాబెర్రీ అంటే అందరికి నోరూరుతుంది. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే పండే ఈ స్ట్రాబెర్రీ ఇప్పుడు...

ఎర్రని రంగు ఆకుపచ్చని తొడిమతో హ్రుదయాకారంలో వుండే స్ట్రాబెర్రీ అంటే అందరికి నోరూరుతుంది. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే పండే ఈ స్ట్రాబెర్రీ ఇప్పుడు విశాఖ ఏజేన్సీలోనూ విస్తరిస్తోంది. వీటి సాగును చేపట్టిన మన్యం రైతులు మంచి దిగుబడిని సాధిస్తూ సిరులు పంటను పండిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ విశాఖ ఏజేన్సీ చింతపల్లి లో కొంతమంది స్ట్రాబెర్రీ ని ప్రయోగాత్మకంగా పండిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు.

గులాబీ జాతికి చెందిన స్ట్రాబెర్రీ అమెరికాలో పుట్టింది. యూరోపియన్లు ఈ వంగడాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేవలం విశాఖ ఏజెన్సీలో మాత్రమే స్ట్రాబెర్రీ పండుతోంది. ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా చింతపల్లి పరిసర ప్రాంతాల్లో గిరిజన రైతులు స్ట్రాబెర్రీ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. చింతపల్లి మండలానికి చెందిన గిరిజన రైతు సత్యనారాయణ స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. గత ఏడాది స్ట్రాబెర్రీ సాగులో లాభాలను ఆర్జించడంతో ఈ ఏడు ఈ పంట సాగునే ఎన్నుకుని సిరుల పంటను పండిస్తున్నాడు.

విశాఖ‌ ఏజేన్సీ చల్లని వాతావరణం, మంచినీటీ వసతులతో కొత్త పంటలకు వేదిక అవుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో అత్యల్ప డీగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే చింతపల్లి, లంబసింగి లో స్ట్రాబెర్రీ పంటకు అనుకూలంగా వుంది. దీంతో స్ట్రాబెర్రీ సాగు పై ఆసక్తి చూపించాడు రైతు సత్యనారాయణ. తన 3 ఎకరాల్లో పూణె నుంచి దిగుమతి చేసుకున్న వింటర్‌డాన్‌ రకం స్ట్రాబెర్రీ మొక్కలను గత ఏడాది సెప్టెంబర్‌ ఆఖరులో సాగు మొదలుపట్టాడు.

ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సహకారంతో శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నాడు ఈ రైతు. స్ట్రాబెర్రీ మొక్కలను అడుగు ఎత్తు కలిగిన బెడ్స్‌ ఏర్పాటు చేసి మధ్య అడుగు దూరం పాటిస్తూ నాట్లు వేసుకున్నారు. స్ట్రాబెర్రీలు నేలకు తగిలి పాడైపోకుండా వుండేందుకు మల్చింగ్‌ షీట్‌ వేసుకున్నారు. పంటకు పూర్తిస్థాయిలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసుకున్నారు

స్ట్రాబెర్రీ సాగుకు 14 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాడు ఈ రైతు. ఒక్కో మొక్కకు 15 రూపాయల వరకు ఖర్చు చేశాడు. మూడు నెలల్లో పంట చేతికి వస్తుంది. పూలు పూసినప్పటి నుండి పండు దశకు వచ్చేవరకు సుమారు 45 రోజుల సమయం పడుతుంది.

అయితే ప్రస్తుతం మార్కేటింగ్ పెంచుకోవడంలో రైతులు కాస్త ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ లు లేకపోవడం పండు కోసిన కొన్ని గంటల్లోనే తాజాదనం కోల్పోవడంతో ఫాస్ట్ మార్కేటింగ్ తో పాటు శీతల గిడ్డంగులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బావుంటుందని రైతులు కోరుతున్నారు. పైగా ఏజేన్సీలో గిరిజన యువత కు ఉపాధి కలుగుతుంది. ఈ దిశ గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories