కుందేళ్ళ పెంపకంలో రాణిస్తున్న అనంతపురం జిల్లా యువతి

కుందేళ్ళ పెంపకంలో రాణిస్తున్న అనంతపురం జిల్లా యువతి
x
Highlights

నలుగురు నడిచే దారిలో కాకుండా కొత్త దారిలో ప్రయాణం ప్రారంభించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఆ యువతి. పోస్ట్‌గ్రాడ్యుయేట్ పూర్తి చేసినా ప్రైవేటు...

నలుగురు నడిచే దారిలో కాకుండా కొత్త దారిలో ప్రయాణం ప్రారంభించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఆ యువతి. పోస్ట్‌గ్రాడ్యుయేట్ పూర్తి చేసినా ప్రైవేటు ఉద్యోగాలపై మక్కవను పెంచుకోలేదు. స్వతహాగా వ్యాపారం చేయాలనుకుంది. కుందేళ్ళ పెంపకాన్ని చేపట్టింది. పూర్తి అవగాహనతో పక్కా ప్రణాళికతో కుందేళ్ళ పెంపకంలో లాభాల గమ్యం చేరుకుంటోంది. కుందేళ్ళ పెంపకాన్ని ఓ ఉపాధి మార్గంగా మల్చుకున్నారు అనంతపురం జిల్లా యువ మహిళా రైతు రామాంజులమ్మ.

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన రామాంజులమ్మ ఎమ్మెస్సీ పూర్తి చేసింది. చదువు పూర్తైన తరువాత ఏదైనా వ్యాపారం చేయాలనుకుంది. ఏ వ్యాపారం చేసినా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు దక్కాలన్నది రామాంజులమ్మ సిద్ధాంతం అందుకే నాగిరెడ్డి పల్లి గ్రామంలో కుందేళ్ల పెంపకాన్ని ప్రారంభించింది. మొదట 100 కుందేళ్లతో ఫామ్‌ను మొదలుపెట్టింది. ప్రస్తుతం వీటి సంఖ్య 900లకు చేరుకుంది.

ఎనిమిద రకాల కుందేళ్లు ఫాంలో పెంచుతున్నారు. ఒక్కో కుందేలు 2 నుంచి 12 పిల్లలను పెడతాయి. వాటని నెల రోజుల తరువాత తల్లి దగ్గరి నుంచి వేరు చేసిన తరువాత నాలుగు నెలలకు రెండు నుంచి రెండున్నర కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఇందులో ఫీమేల్స్‌ను బ్రీడర్స్‌గా, మేల్ ను మీట్ గా విక్రయిస్తున్నారు. లైవ్ మీట్‌ కిలో 200 నుంచి 250 రూపాయలు పలుకుతోంది కట్ మీట్ 450 నుంచి 500 వరకు విక్రయిస్తున్నారు పిల్లలు పుట్టినప్పటి నుంచి వాటని అమ్మే వరకు ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు.

కుందేళ్లకు పప్పుజాతి పశుగ్రాసమైన లూసర్న్‌ గడ్డిని మేతగా ఇస్తున్నారు. గ్రాసాలతో పాటు దాణాను అందిస్తున్నారు. దాణా మిశ్రమాన్ని సొంతగా తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా నాణ్యంగా ఉంటుందని ఈ యువ మహిళా రైతు చెబుతోంది. గడ్డిని పూర్తిగా సహజ పద్ధతుల్లోనే పెంచుతున్నారు. కుందేళ్ళకు సీజనల్ వారిగా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే సీజన్‌కు తగ్గట్లుగా కుందేళ్ళకు అనుకూల వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు. వాటి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ప్రత్యేకమైన శ్రద్ధతో వీటిని పెంచుతున్నారు.

తక్కువ ఖర్చుతో అనువైన వసతిని, పంజరాలను నిర్మించుకున్నారు. గాలి, వెలుతురు విస్తారంగా ప్రసరించేలా కుందేళ్లకు వసతి సౌకర్యం అనుకూలంగా ఉండేటట్లు కేజ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. సీజన్ల వారీగా కుందేళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా పెంచుతున్నారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.

కుందేళ్ల పెంపకం లాభసాటిగా ఉంటుంది. పెంపకంలో యాజమాన్య పద్ధతుల ద్వారా మెలకువలు పాటించాలి. మంచి వసతి, ఆరోగ్య సంరక్షణ తదితర వాటిపై జాగ్రత్తలు తీసుకునంటే ఏడాది పొడవునా లాభాలు పొందవచ్చు. అందుకు ఈ యువ మహిళా రైతే నిదర్శనం సొంతంగా భూమి లేని రైతులు, యువత, మహిళలు కుందేళ్ల పెంపకాన్ని పార్ట్ టైమ్ జాబ్‌గా చేపట్టవచ్చు. మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories