ఖర్చులు పోను నెలకు రూ.80 వేల ఆదాయం

ఖర్చులు పోను నెలకు రూ.80 వేల ఆదాయం
x
Highlights

అతను ఓ టెలికాం సంస్థలో ఉద్యోగి. వేలల్లో జీతం అయినా కొత్తగా ఏదైనా చేయాలనే తపన అతనిది. అందరిలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్నదే అతని ఆలోచన అందుకే ఉద్యోగం...

అతను ఓ టెలికాం సంస్థలో ఉద్యోగి. వేలల్లో జీతం అయినా కొత్తగా ఏదైనా చేయాలనే తపన అతనిది. అందరిలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్నదే అతని ఆలోచన అందుకే ఉద్యోగం చేస్తూనే కోళ్ల ఫామ్‌ను నిర్వహిస్తున్నాడు. అందులోనూ పూర్తి ఆర్గానిక్ విధానాలను అనుసరిస్తూ నాటు కోడి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాడు. పౌల్ట్రీ నిర్వహణలో పూర్తి పకగడ్బందీ చర్యలు తీసుకుని నెలకు ఉద్యోగి మాదిరి 80 వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.

వనపర్తి జిల్లా, మనపర్తి మండలం, అచ్యుతాపురం గ్రామంలో ఆర్గానిక్ పద్ధతిలో నాటు కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు ప్రకాశ్‌. ప్రకాశ్ వృత్తి రిత్యా ఓ టెలికాం సంస్థలో ఉద్యోగి. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు అయినా సాగు రంగంలో ఏదైనా సాధించాలనే తపన అతనిది అందుకే వ్యవసాయ అనుబంధరంగమైన పౌల్ట్రీని ఎంచుకుని నాటు కోడి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా బీవీ380 బ్రీడ్‌ను ఎంచుకున్నాడు. కేజ్ కల్చర్ విధానంలో వీటి పెంపకాన్ని చేపట్టాడు. ప్రజలకు ఆరోగ్యకరమైన , పోషక విలువలతో కూడిన గుడ్లను అందించాలన్నది తన ఉద్దేశమని చెబుతున్నాడు ప్రకాశ్‌.

రసాయనాలతో పొంచి ఉన్న ముప్పును తెలుసుకుంటున్న ప్రజలు ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకునేందుకు ప్రస్తుతం ఆసక్తిని కనబరుస్తున్నారు. అందుకే ఎన్నో పోషకవిలువలు కలిగిన గుడ్లను పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు ప్రకాశ్‌. కోళ‌్లకు స్థానికంగా లభించే చింత, వేప, జామ, అల్లనేరేడు చెట్ల ఆకులను దాణాగా ఇస్తున్నాడు. వాటితో పాటు సోయా, మక్కలు,నూకలు, తౌడును అందిస్తున్నాడు. దీనివల్ల కోడికి ప్రతీ రోజు సమతుల్యమైన ఆహారం లభిస్తుందని చెబుతున్నాడు ప్రకాశ్. అంతేకాదు కోళ్లు ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్ బారిన పడకుంగా ఉండేందుకుగాను పసుపు నీటిని, అల్లంవెల్లుల్లి నీటిని అందిస్తున్నారు.

లేయర్ కోళ్ల కంటే ఈ కోడిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నా కాలానికి అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రకాశ్‌. షెడ్డులో ఎప్పుటికప్పుడు పరిశ‌ుభ్రతను పాటిస్తున్నాడు. ఊరికి దూరంగా షెడ్డు ఉండడం వల్ల దోమలు, ఈగలు, పాముల నుంచి కోళ్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ట్రయల్ రన్‌గా సీమకోళ్లు, బాతులను పెంచుతున్నాడు. అలాగే కోళ్ల వ్యర్థాలను సేకరించి దానిని స్థానిక రైతులకు ఎరువుగా విక్రియస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు.

ఇక ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఫామ్ నిర్వహణకు ప్రతీ రోజు 3 వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. రోజూ వెయ్యి గుడ్ల వరకు ఉత్పత్తి జరుగుతోంది. నెలకు ఎంతలేదన్నా 80 వేల రూపాయల వరకు మిగులుతోందంటున్నాడు ప్రకాశ్‌ ప్రస్తుతం మార్కెటింగ్ బాగున్నా ఫామ్‌ నిర్వహణలో మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు ఈ రైతు. నస్టాలను చవి చూసాడు. వాటన్నింటిని అధిగమించి, ఫామ్‌ నిర్వహణలో అవగాహన పెంచుకుని నేడు లాభాల బాటలో పయనిస్తున్నాడు. కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారు తప్పక కోళ్ల పెంపకం, మార్కెటింగ్‌పై పూర్తి అవగాహన తెచ్చుకునే అడుగులు వేయాలని సూచిస్తున్నారు.

తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో పౌల్ట్రీ రంగం వైపు అడుగులు వేసిన ప్రకాశ్‌ లాభార్జనే ధ్యేయంగా కాకుండా ఆర్గానిక్ నాటు కోడి గుడ్లను ఉత్పత్తి చేస్తూ అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు. అదే తన లక్ష్యమంటున్న రమేశ్ నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories