తెలంగాణ రాష్ట్రం మత్స్యసంపదలో మరింత వృద్ధి

తెలంగాణ రాష్ట్రం మత్స్యసంపదలో మరింత వృద్ధి
x
Highlights

తెలంగాణ రాష్ట్రం మత్స్యసంపదలో మరింత వృద్ధి సాధిస్తోంది. ఇటు వినియోగంలోనూ పురోగతి నెలకొంటోంది. ఇప్పటి వరకు మాంసం వినియోగంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణలో,...

తెలంగాణ రాష్ట్రం మత్స్యసంపదలో మరింత వృద్ధి సాధిస్తోంది. ఇటు వినియోగంలోనూ పురోగతి నెలకొంటోంది. ఇప్పటి వరకు మాంసం వినియోగంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణలో, రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా ఉత్పత్తితో పాటు వినియోగం పెరిగింది. దీంతో ఈ ఏడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనవనరుల్లో 80 కోట్ల 69 లక్షల చేపపిల్లల పంపిణీకి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు మత్స్యశాఖ అధికారులు. చేపల ఉత్పత్తి, వినియోగంలో తెలంగాణ పురోగతి సాధిస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరుగుతున్నది. ముఖ్యంగా ఉచిత చేపపిల్లల పంపిణీతో మరింత వృద్ధిని సాధిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం 2017-18 సంవత్సరంలో 11068 జలాశయాలు, చెరువులు, ఇతర జలవనరుల్లో 51 కోట్లు, 2018-19 సంవత్సరంలో 10786 జల వనరుల్లో 49కోట్ల15 లక్షల చేపపిల్లలను ఉచితగా విడుదల చేసింది. దీతో పాటు మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ రకాల పరికరాలు అందజేసింది. ఫలితంగా చేపల ఉత్పత్తి పెరిగింది. 2019-20 సంవత్సరంలో 27189 నీటివనరుల్లో 80 కోట్ల 69 లక్షల చేపపిల్లలను ఉచితంగా పంపిణీకి మత్స్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2016-17 సంవత్సరంలో లక్షా 93 వేల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా 2017-18 లో ఏకంగా 2 లక్షల 62 వేల టన్నులకు పెరిగింది. అయితే 2018-19 సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా అక్కడక్కడా ఉచిత చేపపిల్లలను పంపిణీ చేయపోవడంతో ఉత్పత్తి కొద్దిగా తగ్గింది. ఈ ఏడాది 2 లక్షల 40 వేల టన్నుల ఉత్పత్తి అయింది. రాష్ట్రంలో చేపల వినియోగంలో పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టణ ప్రజల కంటే రెట్టింపు స్థాయిలో గ్రామీణులు చేపలను తింటున్నట్లు మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేస్‌లైన్ సర్వే తేల్చింది.

చేపలు తినే జనాబాను లెక్కల్లోకి తీసుకుంటే రాష్ట్రంలో తలసరి వినియోగం 7.88 కేజీలుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 9.66 కేజీలు ఉండగా పట్టణాల్లో 4.88 కేజీల తలసరి వినియోగం ఉంది. భారత వైద్యపరిశోధనా మండలి సిఫారసుల ప్రకరం తలసరి చేపల వినియోగం 12 కేజీలు ఉండాలి. ఆ ప్రకారంగా చూస్తే రాష్ట్రంలో చేపల వినియోగం కొంత తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ రకాల చర్యల కారణంగా ఇప్పుడిప్పుడే చేపల ఉత్పత్తి, వినియోగంలో అధికంగా మార్పు వస్తుంది. పట్టణ ప్రాంత ప్రజల్లో చేపలు తినాలనే కోరిక ఉన్నప్పటికీ అవి అందుబాటులో లేకపోవడంతో తినలేకపోతున్నారని అధికారులు గుర్తించారు.

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాంసం ప్రియులు అధికంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో 71 శాతం మంది మాంసం ప్రియులైతే, తెలంగాణలో ఏకంగా 98.7 శాతం తింటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 98.55 శాతం, ఏపీలో 98.25 శాతం , ఒడిశా 97.25 , కేరళలో 97 శాతం ప్రజలు మాంసం, చేపలు తింటారు. రాష్ట్రంలో చేపలు మాత్రమే తినేవారు 90 శాతం మంది ఉంటారని మత్స్యశాఖ నిర్థారించింది. జాతీయ తలసరి ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఇంకా 30 శాతం అదనంగా చేపలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories