TSPSC: నేడు తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌

Group-1 Prelims Exam in Telangana today
x

TSPSC: నేడు తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌

Highlights

TSPSC: కఠిన నిబంధనలు అమలు చేస్తున్న టీఎస్పీఎస్సీ

TSPSC: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష జరగనుంది. గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని చర్యలు తీసుకుంది. పేపర్ లీకేజీల నేపథ్యంలో.. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఇవాళ నిర్వహిస్తోంది టీఎస్పీఎస్సీ. ఇప్పటికే లీకేజీ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న టీఎస్పీఎస్సీ.. ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణలో మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 3లక్షల 80 వేల 72 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో గ్రూప్-1 పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే.. ఈసారి పరీక్షను పకడ్బంధీగా నిర్వహించేందుకు.. టీఎస్పీఎస్సీ కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.

ఉదయం పదిన్నరకు పరీక్ష ప్రారంభమవనున్న నేపథ్యంలో.. పదిహేను నిమిషాల ముందే కేంద్రంలోకి ఎంట్రీ ఆపేయనున్నారు. అభ్యర్థుల వెంట ఏదైనా ఓరిజినల్‌ గుర్తింపు కార్డు.. అంటే ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీని కచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్‌ వాచ్‌, సెల్‌ఫోన్‌‌తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లడానికి వీల్లేదు.

అభ్యర్థులు తమ కాళ్లకు షూ కూడా ధరించి రావొద్దని.. కేవలం చెప్పులను మాత్రమే ధరించి ఎగ్జామ్ సెంటర్లకు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను సైతం ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహిస్తోంది టీఎస్‌పీఎస్సీ. పరీక్ష రాస్తోన్న అభ్యర్థులకు సమయం తెలియడం కోసం ప్రతీ అరగంటకు ఓ సారి బెల్ మోగించనున్నారు. అభ్యర్థులు ఎవరైనా నిబంధనలు పాటించకుంటే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఓఎంఆర్ షీట్ నింపే ముందు ఒకటి రెండు సార్లు నిబంధనలు చదువుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించింది. ఎలాంటి మిస్టేక్ చేసినా ఓఎంఆర్‌ను వాల్యుయేషన్ చేయబోమని బోర్డు స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories