B.Tech Students: బీటెక్​ చేసిన వారికి గుడ్​న్యూస్​.. విద్యుత్​ సంస్థలో ఉద్యోగాలు..!

Good News For Those Who Completed B.Tech Assistant Engineer Jobs In Telangana
x

B.Tech Students: బీటెక్​ చేసిన వారికి గుడ్​న్యూస్​.. విద్యుత్​ సంస్థలో ఉద్యోగాలు..!

Highlights

B.Tech Students: తెలంగాణలో బీటెక్​ చేసినవారికి ఇది సువర్ణవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి టీఎస్​ జెన్​కో నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.

B.Tech Students: తెలంగాణలో బీటెక్​ చేసినవారికి ఇది సువర్ణవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి టీఎస్​ జెన్​కో నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అక్టోబర్‌‌ 29వ తేదీలోగా ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్​లో) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.65,600 నుంచి రూ.1,31,220 చెల్లిస్తారు.

అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 7 నుంచి అక్టోబర్​ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 400 చెల్లించాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిసెంబర్ 3న రాత పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం www.tsgenco.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

కెమిస్ట్‌‌ పోస్టులు

జెన్​కోలో 60 కెమిస్ట్‌‌ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన జారీచేసింది. బీఎస్సీ(కెమిస్ట్రీ), మొదటి శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష డిసెంబర్ 3న నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories