లేఖ లేవనెత్తిన ప్రశ్నలు

లేఖ లేవనెత్తిన ప్రశ్నలు
x
Highlights

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో అత్యంత కీలకంగా మారిన లేఖపై వైసీపీ శ‌్రేణులు, అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసులో ప్రమేయమున్న కొందరిని...

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో అత్యంత కీలకంగా మారిన లేఖపై వైసీపీ శ‌్రేణులు, అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసులో ప్రమేయమున్న కొందరిని తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అసలు లేఖ రాసే శక్తి ఉన్న వివేకానంద రెడ్డి చిన్న ఫోన్ ఎందుకు చేయలేకపోయారంటూ ప్రశ్నిస్తున్నారు.

పోలీసు అధికారుల సమాచారం మేరకు వైఎస్ వివేకానంద రెడ్డి గురువారం రాత్రి పదకొండున్నర గంటలకు చేరుకున్నారు. ఉదయం ఐదు గంటలకు వివేకానంద రెడ్డి పీఏ వచ్చాక ఆరున్నర గంటల సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. దీన్ని బట్టి ఈ ఐదున్నర గంటల మధ్యలోనే హత్య జరిగినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు. అయితే ఈ హత్య సమయంలో వైఎస్ వివేకా రాసినట్టు ఓ లేఖను పోలీసులు విడుదల చేశారు. ఇందులో డ్రైవర్‌‌ ప్రసాద్‌ తనను తీవ్రంగా కొట్టినట్టు వివేకా తెలియజేశాడు. ఇప్పుడు ఈ లేఖపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి లేఖలు స్పష్టించారంటూ తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రక్తపు చేతులతో వివేకా లేఖ రాస్తే .. అక్షరాల మధ్య రక్తపు మరకలు ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు ? ఇదే సమయంలో రక్తపు చివరి భాగంలో రక్తం పూసినట్టు ఉందని ఆరోపిస్తున్నారు ? ఇతరులు ఎవరో లేఖ రాసి కేసును తప్పుదోవ పట్టించుదుకే ఇలా చేశారంటూ ఆరోపిస్తున్నారు. కుడి చేతి వేళ్లకు తీవ్ర గాయాలయిదే లెటర్ ఎలా రాశారు ? కాళ్లు, చేతులు, తలపై తీవ్ర గాయాలయిన సమయంలో అప్పటికప్పుడు వివేకానందకు పెన్ను ఎలా లభించింది ? పెన్ను కోసం బెడ్‌ రూం అంతా తిరిగితే రక్తపు మరకలు ఎందుకు కాలేదని ప్రశ్నిస్తున్నారు. అలా కాకుండా నైట్‌ డ్రస్‌కు పెన్ను పెట్టుకుని ఉంటే ఆ పెన్ను పోలీసులకు ఎందుకు లభించలేదని ప్రశ్నిస్తున్నారు ? పెన్ను దొరికితే వేలు ముద్రలు ఉంటాయని కావాలనే మాయం చేశారా ? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు?

మంచం, బాత్రంలోనే రక్తం మరకలు ఉండటంపై కూడా వైసీపీ శ‌్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు లేఖ రాసే శక్తి ఉన్న వివేకా ఫోన్ ఎందుకు చేయలేకపోయాంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఫోన్ చేస్తే క్షణాల్లో విషయం తెలిసి ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నా ఆ పని వివేకా ఎందుకు చేయలేకపోయారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒంటిపై ఏడు గొడ్డలి గాయాలున్న వ్యక్తి లెటర్ రాయడం ఎంతవరకు సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఇంటి మనుషులు, వివేకానంద రెడ్డి పీఏ కూడా గుర్తించని లేఖను ఎవరు గుర్తించారు ? ఎప్పుడు గుర్తించారు ? పోస్ట్ మార్టం పూర్తయిన తరువాత సాయంత్రం వేళ లేఖ లభించినట్టు చెప్పడం వెనక ఉద్దేశాలేంటని ప్రశ్నిస్తున్నారు ? హత్య జరిగిందని పోలీసులు చెబుతున్న సమయంలో దుండగుల సమక్షంలో లేఖ ఎలా రాస్తాడని ప్రశ్నిస్తున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories