రోడ్డు ప్రమాదంలో దర్శకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో దర్శకుడు దుర్మరణం
x
Highlights

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడుబిద్రె శిర్థాడి వద్ద జరిగిన కారు ప్రమాదంలో యువ దర్శకుడు మృతి చెందాడు. కారు అదుపుతప్పి బలంగా చెట్టుకు ఢీకొట్టడంతో...

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడుబిద్రె శిర్థాడి వద్ద జరిగిన కారు ప్రమాదంలో యువ దర్శకుడు మృతి చెందాడు. కారు అదుపుతప్పి బలంగా చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కన్నడ దర్శకుడు హ్యరిస్‌ హౌదాల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున హ్యరిస్‌ కారులో మూడుబిద్రె నుండి శిరిడికు వెళ్తుండగా ప్రమాదం ఛోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories