జయరాం హత్య కేసు మరో మలుపు

జయరాం హత్య కేసు మరో మలుపు
x
Highlights

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ జూబ్లీహిల్స్‌ పోలీసులను...

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె శిఖా చౌదరిపై ఫిర్యాదు చేశారు. జయరాంతో నాకు 30 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. మా బంధం దృఢంగా సాగింది. ఆయన్ని నా నుంచి కిరాతకంగా తీసుకెళ్లిపోయారు. ఆయన మృతి మాకు దిగ్భ్రాంతి కలిగించింది. ఆయనకు గొప్ప విజన్‌ ఉంది. నా భర్తను ఎందుకు చంపారు? ఒక జీవితం విలువ రూ.80లక్షలా? క్రిమినల్స్‌ను ఉద్దేశించి అడుగుతున్నా. ఈ హత్యకు జవాబుదారీ ఎవరు? నా జీవితాన్ని నాశనం చేశారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు. ఇక్కడికి వచ్చాక హత్య అని తెలిసింది.

గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నా భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయాను. నా భర్తకు విషమిచ్చారని తొలుత అన్నారని, ఆ తర్వాత కొట్టారని, ఇంకోసారి బీరుసీసా కథ అల్లారని.. ఇలా ఏపీ పోలీసులు రోజుకో డ్రామాతో కేసును నీరుగార్చారని పద్మశ్రీ మండిపడ్డారు. కాగా తన భర్త పోస్టుమార్టం నివేదిక కావాలని గత నాలుగు రోజులుగా నందిగామ పోలీసులను కోరుతున్నా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్ర పోలీసుల్ని శిఖా చౌదరి ప్రభావితం చేసిందనే అనుమానాలున్నాయని పద్మశ్రీ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories