దారుణం : అత్తింటి వారు ఆహ్వానించలేదని..

thai
x
thai
Highlights

థాయ్ లాండ్ లో న్యూ ఇయర్ వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ అత్తింటివారు చేసుకుంటున్న పార్టీకి తనని సరిగా ఆహ్వానించలేదని ఓ థాయ్‌ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు.

థాయ్ లాండ్ లో న్యూ ఇయర్ వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ అత్తింటివారు చేసుకుంటున్న పార్టీకి తనని సరిగా ఆహ్వానించలేదని ఓ థాయ్‌ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తనకు మర్యాదలు చేయలేదని భావించి అత్తింటి వారిని, భార్యాపిల్లల్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. థాయ్ లాండ్ కు చెందిన సుచీప్ సార్సంగ్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భార్యను పిల్లలను మాత్రమే ఆమె కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. సుచీప్ కు ఆహ్వానం లేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సుచీప్ అర్ధరాత్రి భార్య కుటుంబ సభ్యులు పార్టీ చేసుకుంటున్న ప్రాంతానికి వెళ్లి వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భార్య, ఇద్దరు పిల్లలు, మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సుచీప్ కూడా తనపై కాల్పులు జరుపుకున్నాడు. ఈ సంఘటనపై థాయ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories