దారుణం : టికెట్‌ లేదంటే అత్యాచారం జరిపే టీసీ

దారుణం : టికెట్‌ లేదంటే అత్యాచారం జరిపే టీసీ
x
Highlights

చెన్నైకి చెందిన ఓ టీసీ టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించే మహిళల పట్ల దారుణానికి పాల్పడుతున్నాడు. వారిపై బలవంతంగా అత్యాచారాలు జరుపుతున్నాడు. ఓ లాడ్జిలో...

చెన్నైకి చెందిన ఓ టీసీ టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించే మహిళల పట్ల దారుణానికి పాల్పడుతున్నాడు. వారిపై బలవంతంగా అత్యాచారాలు జరుపుతున్నాడు. ఓ లాడ్జిలో యువతితో ఏకాంతంగా గడుపుతున్న టీసీ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడంతో కొంతకాలంగా సాగుతున్న అతడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

చెన్నై ఈస్ట్‌ తాంబరం ప్రాంతానికి చెందిన ఓ టీసీ. ఎగ్మూరు రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్నాడు. రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణించే మహిళలను అతను పట్టుకునేవాడు. అయితే వారివద్ద అపరాధ రుసుము వసూలు చేయకుండా, తనతో గడపాలని, లేదంటే కేసుపెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించేవాడు. దాంతో కొందరు మహిళలు అతడికి లొంగేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఎగ్మూరులోని ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడిలో టీసీ ఓ యువతితో కలిసి ఉండగా పట్టుకున్నారు. అతడికి సహకరించిన ముగ్గురు వ్యక్తులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్న పోలీసులకు అతడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. దాంతో కొంతకాలంగా టీసీకి సహకరిస్తున్న లాడ్జి యజమాని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories