పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ చోరీ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ చోరీ
x
Highlights

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం బ్యాంకులో చోటుచేసుకుంది. 26, 27 తేదీలు బ్యాంకుకు సెలవు దినాలు...

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం బ్యాంకులో చోటుచేసుకుంది. 26, 27 తేదీలు బ్యాంకుకు సెలవు దినాలు కావడంతో సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకు తెరిచారు. అనంతరం బ్యాంకు లోపలికి వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది. గోడకు కన్నం పెట్టిన దుండగులు బ్యాంకు స్ట్రాంగ్‌ రూమ్‌లోని ప్రవేశించినట్టుగా తెలుస్తోంది.. దాంతో బ్యాంకులో 10 కోట్ల రూపాయల నగదు, 5 కేజీల బంగారాన్ని దుండగులు అపహరించారు. జాతీయ రహదారి పక్కనే ఉండే సమయపురంలో ఈ దోపిడీ జరగడం అనుమానాలకు తావిస్తోంది. కాగా

బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు. బ్యాంకు సీసీటీవీల్లో రికార్డైన దృశ్యాలను సేకరిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొన్నట్టు వారు అనుమానిస్తున్నామన్నారు. వెల్డింగ్‌ మిషన్‌తోపాటు పలు పరికరాలను గుర్తించామని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories