జయరామ్ మృతి కేసులో రాకేష్ రెడ్డి తండ్రి స్పందన

జయరామ్ మృతి కేసులో రాకేష్ రెడ్డి తండ్రి స్పందన
x
Highlights

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ మృతి కేసులో నిందితుడుగా భావిస్తున్న రాకేష్ రెడ్డి చాలా మంచి వాడని ఆయన తండ్రి చెబుతున్నారు. తన కుమారుడికి రాజకీయ...

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ మృతి కేసులో నిందితుడుగా భావిస్తున్న రాకేష్ రెడ్డి చాలా మంచి వాడని ఆయన తండ్రి చెబుతున్నారు. తన కుమారుడికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని.. గతంలో తన కుమారుడిపై ఎటువంటి ఎటువంటి కేసులు లేవని చెప్పారాయన.. జయరాంను రాకేష్‌ హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. తన కుమారుడికి శిఖా చౌదరి పరిచయం కాకముందు మా దగ్గరే ఉండేవాడు.

ఆమె పరిచయం అయిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఇంటికి రావడం కూడా మానేశాడు. ఆమె ఎప్పుడు పరిచయం అయిందో మాకు తెలియదు. శిఖాను నేనెప్పుడూ చూడలేదు. గతంలో మోసం కేసులో అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. జయరాం హత్య కేసులో కావాలనే ఇరికించారు. అసలు అతడికి సంబంధమే లేదు. ఆర్థికంగా మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. జయరాం ఎవరో మాకు తెలియదు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రాకేష్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories