నటి ఝాన్సీ ఆత్మహత్యకు కారణం చెప్పిన సూర్య?

నటి ఝాన్సీ ఆత్మహత్యకు కారణం చెప్పిన సూర్య?
x
Highlights

టీవీ సీరియల్ నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు క్రమంగా వేగం పెంచుతున్నారు. ఈ కేసులో బాబి, గిరిని అనే ఇద్దరు ఫొటోగ్రాఫ్ర్లను కూడా అదుపులోకి...

టీవీ సీరియల్ నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు క్రమంగా వేగం పెంచుతున్నారు. ఈ కేసులో బాబి, గిరిని అనే ఇద్దరు ఫొటోగ్రాఫ్ర్లను కూడా అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు సమాచారం. ఝాన్సీ ఆత్మహత్య కేసులో పలువురిని విచారించిన పంజాగుట్ట పోలీసులు.. నాగఝాన్సీ ప్రియుడు సూర్యతేజను మరోసారి విచారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సూర్యతేజ పోలీసులకు ఝాన్సీ ఆత్మహత్యకు గల కారణాలను చెప్పుకొచ్చినట్టు సమాచారం.

'ఝాన్సీకి గిరి,బాబి అనే ఇద్దరు ఫొటో షూట్ చేసేవారు. ఆ ఇద్దర్నీ నమ్మొద్దని పలుమార్లు ఝాన్సీ కి చెప్పాను.సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని ఆమెను మోసం చేశారు.గిరి పలుమార్లు ఇబ్బంది పెట్టాడని ఝాన్సీకి నాకు పలుమార్లు చెప్పింది. దీంతో గిరికి నేను ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చాను. సినిమా ఆఫర్లు తగ్గడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది' అని పోలీసు విచారణలో సూర్యతేజ చెప్పినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories