వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇక నుంచి..

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇక నుంచి..
x
Highlights

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్ర...

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. లోక్‌సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్‌రెడ్డిని, పార్టీ చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌ను నియమిస్తూ లేఖలో జగన్‌ పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. వైసీపీలో కీలకనేతగా ఉన్న విజయసాయిరెడ్డిని రాష్ట్రమంత్రివర్గంలోకి తీసుకుంటారనే జోరుగా ప్రచారం సాగింది. కానీ.. చివరకు విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు.ఇక ఈ నెల 12న ఏపీ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories