పెందుర్తి సమీకరణలు ఎవరి వైపు నిలుస్తున్నాయి?

పెందుర్తి సమీకరణలు ఎవరి వైపు నిలుస్తున్నాయి?
x
Highlights

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ ప్రజలు పోలింగ్ పల్స్ ఎలా వుండబోతున్నాయి టీడీపీ, కాంగ్రెస్‌కు సమాన ప్రాధన్యత ఇస్తూ వచ్చిన పెందుర్తి ప్రజలు, ఈసారి ఆ...

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ ప్రజలు పోలింగ్ పల్స్ ఎలా వుండబోతున్నాయి టీడీపీ, కాంగ్రెస్‌కు సమాన ప్రాధన్యత ఇస్తూ వచ్చిన పెందుర్తి ప్రజలు, ఈసారి ఆ స్థానాన్ని ఏ పార్టీకీ ఇవ్వబోతున్నారు. విశాఖజిల్లా పెందుర్తి నియెజకవర్గంపై స్పెషల్ రిపోర్ట్.

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకర్గం. ఇక్కడ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 80వ దశకం నుంచి చూస్తే టీడీపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు సముచిత స్థానం కల్పిస్తూ వచ్చారు. ఈ నియోజకవర్గంలో 2,68,537 మంది ఓటర్లు వున్నారు. వారిలో పురుషులు 1,34,666 మంది, మహిళలు 1,33,868 మంది. సబ్బవరం, పెందుర్తి, పెదగంట్యాడ మండలాలు సెగ్మెంట్‌లో ఉన్నాయి. కాపు, గవర సామాజిక వర్గం ఎక్కువుగా వున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ, కాంగ్రెస్ నుంచి గండి బాబ్జీ, పీఆర్పీ నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేయగా, పీఆర్పీ అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు గెలుపొందారు.

2014 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ 18,648 ఓట్ల మెజారిటీతో, వైసీపీ అభ్యర్ధి గండి బాబ్జీపై గెలుపొందారు. ప్రస్తుతం 2019 ఎన్నికలకుగాను టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, వైసీపీ అభ్యర్థిగా అన్నంరెడ్డి అదీప్ రాజ్, బరిలో వుండగా జనసేన నుంచి చింతలపూడి వెంకట్రామయ్య కూడా పోటికి దిగారు.

అయితే 2019 ఎన్నికలు మాత్రం ఈ నియెజకవర్గంలో ఆసక్తికర ఫలితాలను ఇవ్వబోతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, బండారు సత్యనారాయణ, అతని కుమారుడిపై ప్రజల్లో వున్న వ్యతిరేకత, తమకి కలసి వచ్చే అంశాలుగా వైసీపీ భావిస్తోంది. సామాజిక వర్గం కూడా కలసి రావడంతో పాటు జగన్ ఇమేజ్ కూడా విజయం అందిస్తుందని అదీప్ రాజ్ అంచనాలు వేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ టీడీపీ హవాతో తనకే విజయం వరిస్తుందని ఆశాభావంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories