యుద్ధం శరణం రివ్యూ

యుద్ధం శరణం రివ్యూ
x
Highlights

నిర్మాణ సంస్థ‌: వారాహి చలన చిత్రం తారాగణం: నాగౖచెతన్య, లావణ్య త్రిపాఠి, రేవతి, రావు రమేష్‌, శ్రీకాంత్‌, మురళీశర్మ, వినోద్‌కుమార్‌ తదితరులు...

నిర్మాణ సంస్థ‌: వారాహి చలన చిత్రం

తారాగణం: నాగౖచెతన్య, లావణ్య త్రిపాఠి, రేవతి, రావు రమేష్‌, శ్రీకాంత్‌, మురళీశర్మ, వినోద్‌కుమార్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్‌: కృపాకరన్‌
సంగీతం: వివేక్‌ సాగర్‌
కథ: డేవిడ్‌ ఆర్‌. నాథన్‌
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: రజనీ కొర్రపాటి
దర్శకత్వం: కృష్ణ మారిముత్తు
విడుదల తేదీ: 08.09.2017

ఏమాయ చేసావె, 100% లవ్‌, మనం, ప్రేమమ్‌, రారండోయ్‌ వంటి ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్‌ మూవీస్‌తో సక్సెస్‌ఫుల్‌ హీరోగా పేరు తెచ్చుకున్న నాగౖచెతన్య యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సినిమాలు సక్సెస్‌ అవ్వలేదు. బెజవాడ, ఆటోనగర్‌ సూర్య, దడ, సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాలు చైతన్యకు పరాజయాల్ని అందించాయి. తాజాగా కృష్ణ మారిముత్తు దర్శకత్వంలో చేసిన మరో యాక్షన్‌ మూవీ 'యుద్ధం శరణం'. వారాహి చలన చిత్రం బేనర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదౖలెంది. మరి ఈసారి చైతన్యకు 'యుద్ధం శరణం'తో సక్సెస్‌ లభించిందా? దర్శకుడు కృష్ణమారిముత్తు.. చైతన్యని డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చెయ్యడంలో ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన 'యుద్ధం శరణం'లో చూపించిన కొత్త అంశాలేమిటి? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.


యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలనగానే సాధారణంగా రివెంజ్‌ డ్రామాలే గుర్తొస్తాయి. ఇండియన్‌ సినిమాలో రివెంజ్‌ డ్రామాలకు కొదవలేదు. ఒక్కొక్కరు ఒక్కోలా ఈ తరహా చిత్రాల్ని రూపొందించారు.

'యుద్ధం శరణం' విషయానికి వస్తే చాలా సింపుల్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో కుటుంబానికి జరిగిన అన్యాయానికి విలన్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధాన ఇతివృత్తం. కొన్ని అవినీతి ఆరోపణల వల్ల తన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వుందని భావించిన మినిస్టర్‌ ఓ దారుణానికి పాల్పడతాడు. నగరంలో బాంబు పేలుళ్ళ ద్వారా అందరి దృష్టిని మళ్ళించాలనుకుంటాడు. కరడు గట్టిన నేరస్తుడుగా పేరు వున్న నాయక్‌కి ఆ పని అప్పగిస్తాడు. మినిస్టర్‌ చెప్పినట్టుగానే బాంబ్‌ బ్లాస్ట్‌లు చేస్తాడు నాయక్‌. కట్‌ చేస్తే తన తల్లిదండ్రులు మూడు రోజులుగా కనిపించడం లేదని హీరో అర్జున్‌(నాగౖచెతన్య) పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తాడు. అంతటితో ఆగకుండా సిటీలోని అన్ని హాస్పిటల్స్‌లో ఎంక్వయిరీ చేస్తాడు. కానీ, ఫలితం వుండదు. ఈలోగా ఒక యాక్సిడెంట్‌లో అర్జున్‌ తల్లిదండ్రులు చనిపోయారని తెలుస్తుంది. వాళ్ళవి యాక్సిడెంట్‌ మరణాలు కాదని, నాయక్‌ ఆ హత్యలు చేశాడని తెలుసుకుంటాడు అర్జున్‌. సిటీలో బాంబులు పెట్టిన నాయక్‌... అర్జున్‌ తల్లిదండ్రులను ఎందుకు చంపాడు? ఇది తెలుసుకున్న అర్జున్‌ ఎలా రియాక్ట్‌ అయ్యాడు? అతని మీద ఎలా పగ తీర్చుకున్నాడు? అనేది మిగతా కథ.

లవర్‌ బోయ్‌గా మెప్పించిన చైతన్య యాక్షన్‌ హీరోగా సక్సెస్‌ కాలేకపోయాడని గత చిత్రాలు నిరూపించినా మళ్ళీ అదే ఫార్మాట్‌లో వున్న కథని సెలెక్ట్‌ చేసుకున్నాడు. అతను అంతకుముందు చేసిన యాక్షన్‌ సినిమాల్లోని క్యారెక్టర్స్‌ తరహాలోనే ఈ సినిమాలో క్యారెక్టర్‌ కూడా వుంది. చైతన్య ఈ క్యారెక్టర్‌ని సమర్థవంతంగా చెయ్యలేకపోయాడనే చెప్పాలి. తను ఎంతో ప్రేమించే తల్లిదండ్రుల్ని విలన్‌ చంపాడని తెలుసుకున్న తర్వాత హీరో ఎమోషనల్‌ లెవల్స్‌ని చాలా హైలో చూపిస్తారు. కానీ, ఇందులో ఎమోషన్‌ లెవల్స్‌ పీక్స్‌కి వెళ్ళిన సందర్భాలు లేవు. చైతన్యని యాక్షన్‌ హీరోగా కొత్త యాంగిల్‌లో చూపించాలని దర్శకుడు ప్రయత్నం చెయ్యలేదు.

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కొన్ని లవ్‌ సీన్స్‌కి, హీరో వెంట పరిగెత్తడానికి మాత్రమే పరిమితౖమెంది తప్ప ఆమె క్యారెక్టర్‌కి కథలో అంతగా ప్రాధాన్యం లేదు. వీరిద్దరి మధ్య తీసిన లవ్‌ సీన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేదు. రేవతి, రావు రమేష్‌ చేసిన తల్లిదండ్రుల క్యారెక్టర్స్‌ చాలా అసహజంగా వున్నాయి. అన్ని విషయాల్లోనూ వాళ్ళు చేసే ఓవర్‌ యాక్షన్‌ ఆడియన్స్‌ని విసిగిస్తుంది. విలన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్‌ హీరోగా మారి ఎన్నో సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌ చేశారు. ఇప్పుడు 'యుద్ధం శరణం' చిత్రంలో మళ్ళీ విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తన క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ వుంది. విలన్‌గా కెరీర్‌ని కంటిన్యూ చెయ్యడానికి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించకుండా ఈ క్యారెక్టర్‌ చేశాడు శ్రీకాంత్‌. కానీ, విలన్‌గా ఆడియన్స్‌ని ఇంప్రెస్‌ చెయ్యలేకపోయాడు. మిగతా క్యారెక్టర్స్‌ చేసిన నటీనటులు ఓకే అనిపించారు.

ఒక యాక్షన్‌ సినిమా అందర్నీ ఆకట్టుకోవాలంటే టెక్నికల్‌ సపోర్ట్‌ ఎంతో అవసరం. కానీ, ఈ సినిమాకి టెక్నికల్‌గా హెల్ప్‌ అయిన డిపార్ట్‌మెంట్స్‌ లేవు. ఇలాంటి సినిమాల్లో హీరోని చాలా స్టైలిష్‌గా చూపించాలి. ప్రతి సీన్‌ థ్రిల్‌ చేసేదిగా వుండాలి. కానీ, ఈ సినిమాలో అలాంటి అద్భుతాలు జరగలేదు. టేకింగ్‌ పరంగా ఫోటోగ్రఫీ హెల్ప్‌ అవ్వలేదు. మ్యూజిక్‌ విషయానికి వస్తే వివేక్‌ సాగర్‌ ఆకట్టుకోలేకపోయాడు. విజువఃల్‌గా కనువిందు చేసే పాటలు లేకపోవడంతో చేసిన రెండు మూడు పాటలు కూడా సోసోగా వున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా వినసొంపుగా లేదు. ఎడిటింగ్‌ కూడా సినిమాకి మైనస్‌ అయింది. ఎడిటింగ్‌లో కొత్తదనం చూపించే ప్రయత్నం చెయ్యలేదు.

కథ రొటీన్‌గా వున్నట్టే మాటలు కూడా అంతకంటే రొటీన్‌గా వున్నాయి. సినిమాలో చెప్పుకోవడానికి ఒక్క డైలాగ్‌ కూడా లేదు. దర్శకుడు గురించి చెప్పాలంటే రొటీన్‌ కథతో, అంతకంటే రొటీన్‌ కథనంతో రూపొందించిన ఈ సినిమా ఏ దశలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. సినిమా స్లో నేరేషన్‌తో మొదౖలె అదే స్లోని చివరి వరకు కంటిన్యూ అయింది. సినిమాలో ఒక్క కామెడీ సీన్‌ కూడా లేకపోవడం విశేషం. ఇలాంటి రివెంజ్‌ డ్రామాలో ఎంట‌ర్‌టైన్ మెంట్‌ కూడా వుంటే ఆడియన్స్‌కి రిలీఫ్‌ వస్తుంది. భారీ యాక్షన్‌ సినిమాలంటే ఇష్టపడే వారికి ఈ సినిమా అస్సలు రుచించదు. చివరగా ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే యాక్షన్‌ హీరోగా హిట్‌ కొట్టాలని ప్రయత్నించిన నాగౖచెతన్యకి 'యుద్ధం శరణం' వృధా ప్రయాసే అయింది.

చివరగా: రొటీన్‌ రివెంజ్‌ డ్రామా

Show Full Article
Print Article
Next Story
More Stories