రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించిన వైసీపీ ఎంపీలు

Submitted by arun on Fri, 04/06/2018 - 12:47
ysrcp mps

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. శుక్రవారం పార్లమెంట్‌ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. కేంద్రం తీరు మారకపోతే తమ ఎంపీలు పార్లమెంటు సమావేశాల చివరిరోజు మూకుమ్మడిగా రాజీనామానాలు చేస్తారని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ అధినేత ఆదేశం మేరకు ఈరోజు లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే ఎంపీలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు అందజేశారు. అయితే దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ రాజీనామాలపై ఓసారి పునరాలోచించుకోవాలని వారికి సూచించినట్లు సమాచారం. సభలోనే ఉండి పోరాడవచ్చు కదా అని సలహా ఇచ్చారు. తమ రాజీనామా పత్రాలు ఆమోదించాలని వైకాపా ఎంపీలు స్పీకర్‌ను కోరారు. తదనంతరం వైకాపా ఎంపీలు ఏపీ భవన్‌లో దీక్షలో కూర్చోనున్నట్లు సమాచారం.

English Title
ysrcp mps submitted their resignations loksabha speaker

MORE FROM AUTHOR

RELATED ARTICLES