logo

వైసీపీ ఎంపీల సంచలన ప్రకటన...

వైసీపీ ఎంపీల సంచలన ప్రకటన...

వైఎస్సీర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం సంచలన ప్రకటన చేశారు. లోక్‌సభ వాయిదా పడడంతో వారు మండిపడ్డారు. ఈ విధంగా పార్లమెంట్ నిరవధిక వాయిదా పడితే తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఎంపీలు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి.. సంతకాలు చేసిన రాజీనామా లేఖలతో లోక్‌సభకు బయలుదేరారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎనిమిదో సారి ఇచ్చిన నోటీసులు నేడు సభ ముందుకు రానుంది. అయితే నోటీసులపై స్పీకర్‌ చర్చ చేపడతారా, లేదా అనేది తేలాల్సిఉంది. అవిశ్వాసాన్ని తప్పించుకునే క్రమంలో కేంద్రం.. ఏఐఏడీఎంకే ఎంపీల నిరసనలను సాకుగా చూపి పార్లమెంట్‌ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ముందస్తుగా స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖలను సిద్ధంచేశారు.

లైవ్ టీవి

Share it
Top