చంద్రబాబును దారుణంగా కించపరిచిన విజయసాయిరెడ్డి..

Submitted by arun on Tue, 03/27/2018 - 15:33
bv

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరని అన్నారు. నేరస్తులందరికీ లీడర్ చంద్రబాబని, చార్లెస్ శోభరాజ్ ని మించిన వ్యక్తని అన్నారు. కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ‘ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరు...’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లందరికీ లీడర్‌ చంద్రబాబు అని, చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ చంద్రబాబు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యాతో నన్ను పోల్చుతారా? అంటూ ప్రశ్నించారు. నేను ఇప్పటివరకు ఏ ఒక్క బ్యాంక్‌ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. అంతేగాక టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని, రెండేళ్లు శిక్ష పడిన ఎమ్మెల్యే ఇంకా టీడీపీలో కొనసాగుతున్నారని, మీ మంత్రులు, ఎంపీలు పేకాట క్లబ్‌లను నిర్వహిస్తున్నారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

English Title
YSRCP MP Vijayasai Reddy Sensational Comments on Chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES