2017 నారావారి నరకాసుర నామ సంవత్సరం

Submitted by arun on Sat, 12/30/2017 - 15:54
roja

2017 నారావారి నరకాసుర సంవత్సరమని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలన మొత్తం అరాచకాలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అబద్ధాలతో సాగుతోందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు పాలనలో క్యాలెండర్లు మారాయే కానీ, మహిళల తలరాతలు మాత్రం మారలేదని అన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించవద్దని ఆదేశించిన ప్రభుత్వం... 31వ తేదీన తెల్లవారుజాము ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతించిందని మండిపడ్డారు. బాబు హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. విశాఖపట్నం పెందుర్తిలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసి కొట్టారని, అయినా చంద్రబాబు స్పందించలేదని విమర్శించారు.

అనంతపురం జిల్లాలో సుదమ్మ అనే మహిళను కొంచెం పక్కకు జరిపి కట్టమన్నందుకు పయ్యావుల అనుచరులు ఎగిరెగిరి ఆమెను తన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలపై ఏపీలో జరిగిన దాడులు ఎన్నో ఉన్నాయి. పోలీసులు నేరస్తుల కోసం పనిచేస్తున్నారేమో అనిపిస్తోంది. ఆఖరికి టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కూతురుకి కూడా అన్యాయం జరిగిందంటే.. టీడీపీ పాలనలో ఇంతకంటే దౌర్బాగ్యం మరొకటి ఉండదు. టీడీపీలో రౌడీలు, గుండాలే రాజ్యమేలుతున్నారు. ఆడపిల్ల అంటే చంద్రబాబుకు గౌరవం లేదు, పట్టించుకోరు. జెర్రిపోతుల పాలెం ఘటనపై చంద్రబాబు కనీసం ఒక్క ప్రకటన చేయలేదు' అని రోజా చంద్రబాబు వల్ల జరిగిన అన్యాయాలు ఎండగట్టారు.

English Title
ysrcp mla roja fire on cm chandra babu

MORE FROM AUTHOR

RELATED ARTICLES