వైయస్ కుటుంబంలో విషాదం..

Submitted by nanireddy on Thu, 09/06/2018 - 07:42
ysr-uncle-and-former-mla-purushotham-reddy-passes-away

 వైయస్ కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బాబయ్, మాజీ ఎమ్మెల్యే వైయస్ పురుషోత్తమరెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. కొంతకాలంగా గుండె సంబంధితవ్యాధితో బాధపడుతున్న అయన కడపలోని సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. పురుషోత్తంరెడ్డి మృతికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. కాగా నిన్ననే జగన్ కుటుంబసభ్యులు పులివెందులకు వెళ్లారు. ఆయనకు వైయస్ విజయమ్మ, షర్మిల, భారతి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి లు నివాళులు అర్పించారు. 

English Title
ysr-uncle-and-former-mla-purushotham-reddy-passes-away

MORE FROM AUTHOR

RELATED ARTICLES