వెంకయ్యకు క్షమాపణలు చెప్పిన విజయసాయిరెడ్డి

Submitted by arun on Wed, 07/25/2018 - 14:28
Vijayasai Reddy

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభకు క్షమాపణలు చెప్పారు. ఏపీ విభజన చట్టంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరుకు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో సమయం అయిపోయిందంటూ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయన్ని నిలువరించారు. దీంతో విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. విజయసాయి తీరును విపక్ష సభ్యులందరూ తప్పుబట్టారు. ఛైర్మన్‌పై అమర్యాదకరంగా ప్రవర్తించిన విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు. దీంతో సభలో నిన్నటి పరిణామాలకు తాను క్షమాపణ చెబుతున్నట్లు విజయసాయి ప్రకటించారు.
 

English Title
YSR MP V Vijayasai Reddy apologises for his behaviour in Rajya Sabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES