విజయమ్మ 'పాదనమస్కారం'పై లోకేష్ కౌంట‌ర్

Submitted by lakshman on Wed, 04/11/2018 - 04:36
YS Vijayamma Shares Dais At Hunger Strike Site In Delhi

ప్ర‌త్యేక‌హోదాపై వైసీపీ - టీడీపీ - బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది.మైలేజ్ కోసం ఒక‌రిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. టీడీపీ బీజేపీని విమ‌ర్శిస్తూ త్వ‌ర‌లో జ‌రిగే క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటువేయాల‌ని పిలుపునిచ్చింది. క‌ర్నాట‌క‌లో తెలుగువారికి టీడీపీ ఇచ్చిన‌పిలుపుతో ఆ పార్టీ కాంగ్రెస్ కి అనుకూలం, బీజేపీకి వ్య‌తిరేకం అని అర్ధం వ‌చ్చిన‌ట్లు ప‌లువురు క‌మ‌లం నేత‌లు భావిస్తున్నారు. ఇక టీడీపీ - వైసీపీలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాక‌పుట్టిస్తున్నాయి. 
ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీ లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న విష‌యం తెలిసిందే. వారిలో ముగ్గురు ఎంపీల ఆరోగ్యం క్షీణించ‌డంతో వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మిగిలిన ఇద్ద‌రు ఎంపీల ఆరోగ్యం క్షీణిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఎంపీల దీక్ష‌పై వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ స్పందించారు. 
మీ పాదాలకు నమస్కరించి అడుగుతున్నానని, ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పండని, ఏపీ ప్రజలు దేనికీ నోచుకోలేదని వైయస్ విజయమ్మ అన్నారు. అంతేకాదు టీడీపీ ఎంపీలు  వైసీపీ నేత‌ల ఆమ‌ర‌ణ దీక్ష‌ను ఉద్దేశిస్తూ మూడు వికెట్లు పడ్డాయి, ఇంకో రెండు వికెట్లు పడితే వెళ్లి బీజేపీతో రాజీ పడతారని టీడీపీ నేత‌లు అనడం సరికాదని విజయమమ్మ చెప్పారు. భేషజాలకు పోకుండా 25 మంది ఎంపీలు రాజీనామా చేసి హోదా సాధించుకుందామన్నారు.
అయితే విజ‌యమ్మ వ్యాఖ్య‌ల‌పై మంత్రి నారాలోకేష్ కౌంట‌ర్ ఇచ్చారు.  ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము నిలదీస్తామని, కానీ కాళ్లు మొక్కమని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి పోరాడుతామన్నారు. మోడీ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం పెడితే, మద్దతివ్వాలని కోరితే విపక్షాలన్నీ అండగా నిలబడ్డాయన్నారు. ఏపీకి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
  

English Title
YS Vijayamma Shares Dais At Hunger Strike Site In Delhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES