logo

గనుల దోపిడీపై సీబీఐతో విచారణకు చంద్రబాబు సిద్ధమా? : వైయస్ జగన్

గనుల దోపిడీపై సీబీఐతో విచారణకు చంద్రబాబు సిద్ధమా? : వైయస్ జగన్

గుంటూరు జిల్లా దాచేపల్లి గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప‍్రభుత్వం సీఐడీకి వాస్తవాలను కప్పిపుచ్చడమేనని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ట్వీటర్‌ వేదికగా లేఖ రాసిన జగన్‌.. 'అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించి పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత‍్నం చేస్తున్నారు. శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేసినట్లు తేలుతోంది.

‘ప్రతీరోజూ కొన్ని వేల లారీలను ఉపయోగించి ఖనిజాన్ని తరలించేశారు. ఇంత వ్యవహారం నడుస్తుంటే ఇన్నాళ్లుగా ఈ విషయం ఎవ‍్వరికీ తెలియదని అనుకోవాలా?. ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ ఈ దోపిడీల్లో భాగస్వాములు కాకుంటే ఇది జరిగేదా?. రాష్ట్రంలో జరుగుతున్న ఏ సహజ వనరులను మిగల్చలేదు. చంద్రబాబు తన చేతిలో ఉన్న సీఐడీతో విచారణ చేయిస్తే ఏం జరుగుతుంది?. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. మీకూ ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది. మీకూ సీఐడీ ఉంది.. మాకు సీఐడీ ఉంది. మీకూ డీజీపీ ఉన్నాడు. మాకూ డీజీపీ ఉన్నాడు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించలేదా.

సీఐడీ తన చేతిలో ఉన్న సంస్థ అని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. పల్నాడు గనుల దోపిడీ వ్యవహారంలో అలాంటి వ్యక్తి సీఐడీ చేత దర్యాప్తు చేయించడం అపహాస్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని సీబీఐ లాంటి ఏజెన్సీతో గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలి. అప్పుడే నిజా నిజాలు బయటకు వస్తాయి, అందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. అప్పుడే ఎమ్మెల్యే దగ్గర నుంచి చినబాబు, పెదబాబు వరకూ పేర్లు బయటకు వస్తాయన్నారు'.

nanireddy

nanireddy

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top