మరో మైలురాయిని చేరుకున్న జగన్.. వైసీపీలో చేరిన విడుదల రజిని

Submitted by nanireddy on Fri, 08/24/2018 - 18:56
ys-jagan-praja-ankalpayatra-reaches-2800-kms-mileston

వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్పయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ 2800 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. విశాఖ జిల్లా యలమంచిలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 2800 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా మైలురాయికి గుర్తుగా ఒక మొక్కను నాటారు జగన్. ఇదిలావుంటే ప్రముఖ పారిశ్రామికవేత్త విడుదల రజిని వైసీపీలో చేరారు. యలమంచిలి నియోజకవర్గంలో రజిని.. జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇటీవల అమెరికా నుండి ఇండియాకు వచ్చిన ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం టిక్కెట్టును ఆమె ఆశిస్తున్నారు.

English Title
ys-jagan-praja-ankalpayatra-reaches-2800-kms-mileston

MORE FROM AUTHOR

RELATED ARTICLES