టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలి

Submitted by arun on Sat, 07/21/2018 - 13:26
jagan

ప్రత్యేక హోదాను వద్దనడానికి చంద్రబాబు ఎవరని వైసీపీ అధినేతే జగన్ ప్రశ్నించారు. హోదా వద్దని, ప్యాకేజీ అంగీకరించే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిదని నిలదీశారు. బీజేపీపై యుద్ధం చేస్తున్నానంటున్న చంద్రబాబు చేతల్లో మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తప్పు పట్టారు. వైసీపీ ఎంపీల లాగే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసిస్తూ మంగళవారం జగన్..ఏపీ బంద్‌‌కు పిలుపునిచ్చారు.

సీఎం చంద్రబాబుపై ఏపీ విపక్షనేత జగన్ మరోసారి నిప్పులు చెరిగారు. అవిశ్వాసం చర్చ చూస్తే బాధనిపించిందని కాకినాడలో అన్నారు, లోక్‌సభలో కేంద్రం నోటి నుంచి ప్రత్యేక హోదా మాటే రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబే ప్రస్తుత ఏపీ దుస్థితితికి కారణమని చెప్పారు. అసలు ప్రత్యేక హోదా వద్దనడానికి చంద్రబాబెవరు ప్యాకేజీకి ఒప్పుకునే హక్కు ఆయనకు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు.

అవిశ్వాసం తీర్మానం సందర్భంగా టీడీపీ ఎంపీలు మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసిందని జగన్ అన్నారు. నాలుగేళ్ళుగా వైసీపీ చేసిన వాదననే గల్లా జయదేవ్ లోక్‌సభలో వల్లె వేశారని విమర్శించారు. తాము ప్రత్యేక హోదా డిమాండ్ చేసినప్పుడు ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే డిమాండ్ వినిపిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష దేశానికి బలంగా వినిపించాలంటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని వైసీపీ అధినేత డిమాండ్ చేవారు. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తే దేశం మొత్తం కదులుతుందనీ అప్పుడు కేంద్రంలో చలనం వస్తుందన్నారు. ప్రధాని ఎవరైనా తనకు అభ్యంతరం లేదనీ అయితే ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ నిరసిస్తూ ఈ మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చారు. 24న జరిగే బంద్‌కు అన్ని వర్గాలు ,అన్ని పార్టీలు మద్దతివ్వాలని జగన్ కోరారు.

English Title
ys jagan calls andhra pradesh bandh tuesday

MORE FROM AUTHOR

RELATED ARTICLES