ఆ సినిమాను బ్యాన్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా

Submitted by arun on Mon, 01/22/2018 - 14:55
sucide attempt

పద్మావత్ సినిమా రిలీజ్ కు ముందే కర్ణిసేన దేశవ్యాప్తంగా రచ్చ సృష్టిస్తోంది. హర్యానాలోని కురుక్షేత్రలో సినీమాల్ పై కర్ణిసేన కార్యకర్తలు దాడి చేయగా... రాజస్తాన్ లో కర్ణిసేన నాయకుడు టీవీ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. బిల్వరాలోని భారీ టీవీ టవర్ పై తెల్లవారుజామున 4 గంటలకు కర్ణిసేన నేత, పంచాయతీ అధ్యక్షుడు ఉపేంద్ర రాథోడ్ ఎక్కాడు.  తన వెంట పెట్రోల్ డబ్బాను పెట్టుకున్నాడు. పద్మావత్ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాడు. లేకుంటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని కాల్చుకుంటానని బెదిరిస్తున్నాడు. ఉపేంద్ర రాథోడ్ కు కర్ణిసేన కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు. టీవీ టవర్ పై నుంచి ఆందోళనకారుడికి కిందికి దించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. 

English Title
youth climbs up mobile tower demanding ban on padmavat

MORE FROM AUTHOR

RELATED ARTICLES