గుంటూరులో జనతా గ్యారేజ్‌!

గుంటూరులో జనతా గ్యారేజ్‌!
x
Highlights

జనతా గ్యారేజ్‌ ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును ఇదీ జూనియర్ ఎన్టీఆర్‌ సినిమా టైటిల్‌. సామాన్యులకు ఏ సమస్య వచ్చినా జనతా గ్యారేజ్‌‌కు వెళ్లి చెప్పుకుంటే...

జనతా గ్యారేజ్‌ ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును ఇదీ జూనియర్ ఎన్టీఆర్‌ సినిమా టైటిల్‌. సామాన్యులకు ఏ సమస్య వచ్చినా జనతా గ్యారేజ్‌‌కు వెళ్లి చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్నట్లు ఆ సినిమాలో చూపించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ యువకుడు గుంటూరు జిల్లాలో కత్తితో వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై కత్తితో సినిమా సీన్‌ చూపించాడు. ఓ చేత కత్తి పట్టుకొని మరో చేతిలో సెల్‌ఫోన్‌‌లో మాట్లాడుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు.

బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది అదే జనతా గ్యారేజ్. ఇదీ జనతా గ్యారేజ్‌ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్ డైలాగ్‌. అచ్చం ఈ సినిమా తరహాలోనే మీ వెనుక నేనున్నాను మీకు సమస్యలు ఉంటే నాకు చెప్పండి అంటూ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి గుంటూరు జిల్లాలో ఓ యువకుడు హల్‌చల్‌ చేస్తున్నాడు.

సినిమాలో హీరోలాగా కత్తి పట్టుకొని నడిరోడ్డుపై హల్‌చల్‌ చేస్తున్న ఈ యువకుడి పేరు ప్రదీప్‌. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన ప్రదీప్‌ జనతా గ్యారేజ్‌ పేరుతో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాడు. సమస్యలేమైనా ఉంటే తన జనతాగ్యారేజ్‌కి సమాచారమిస్తే న్యాయం చేస్తానంటూ చెప్పుకుంటున్నాడు. సీన్‌ క్రియేట్‌ చేయాలనుకున్నాడో లేక సెన్సెషనల్‌ కావాలనుకున్నాడో తెలియదు కానీ కత్తి పట్టుకొని రోడ్డుపైకి వచ్చి ఇలా వీరంగం సృష్టించాడు.

తన జనతా గ్యారేజ్‌కి సమస్యలు చెప్పుకోవాలంటూ గట్టిగా అరుస్తూ నడిరోడ్డుపై అటూఇటూ తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఫోన్‌‌లో మాట్లాడుతూ నా దగ్గరికి రా క్షణాల్లో పరిష్కరిస్తా అంటూ కేకలు వేశాడు. ప్రదీప్‌‌ను చూసి స్థానికులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రదీప్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌ గ్రూప్‌లో ఉన్న మిగతా వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.

ప్రదీప్‌ గతంలోనూ ఇలా అరాచకాలకు పాల్పడ్డాడని స్థానికులు అంటున్నారు, పోలీసులు పట్టించుకోకపోవడంతోనే, మరింత రెచ్చిపోయి, ఇప్పుడు నడిరోడ్డుపై కత్తితో వీరంగం ఆడాడని అంటున్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే ప్రదీప్ అరాచకాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories