రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వాలకు సుప్రీంలో చుక్కెదురు

రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వాలకు సుప్రీంలో చుక్కెదురు
x
Highlights

వివాదాస్పద సినిమా పద్మావత్ పై నిషేధం విధించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లో పద్మావత్‌‌ను నిసేధించాంటూ ఆయా...

వివాదాస్పద సినిమా పద్మావత్ పై నిషేధం విధించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లో పద్మావత్‌‌ను నిసేధించాంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. పద్మావత్ చిత్రం విషయంలో గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రముఖ దర్శకుడు సంజలీలా భన్సాలీ దర్శక నిర్మాణంలో రూపొందిన పద్మావత్ ఎల్లుండి విడుదల కాబోతోంది. ఈ సినిమాకు వ్యతిరేంగా కర్ణిసేన కొద్ది నెలలోగా ఆందోళనలు వ్యక్తం చేస్తోంది.

పద్మావత్‌ ప్రదర్శించలేమంటూ పిటిషన్‌ వేసిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ‘శాంతిభద్రత పరిరక్షణ రాష్ట్రాల బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించలేమని చేతులెత్తేయడం సరికాదు. జనవరి 25న సినిమా విడుదలవుతుందన్న గత ఆదేశాల్లో మార్పుల్లేవు’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories