తన స్మోకింగ్ హ్యాబిట్ పై రియాక్ట్ అయిన అక్కినేని అఖిల్

తన స్మోకింగ్ హ్యాబిట్ పై రియాక్ట్ అయిన అక్కినేని అఖిల్
x
Highlights

'అఖిల్', 'హలో' లాంటి రెండు డిజాస్టర్ల ను అందుకున్న యువ హీరో అక్కినేని అఖిల్. ఈ మధ్యనే 'మిస్టర్ మజ్ను' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు....

'అఖిల్', 'హలో' లాంటి రెండు డిజాస్టర్ల ను అందుకున్న యువ హీరో అక్కినేని అఖిల్. ఈ మధ్యనే 'మిస్టర్ మజ్ను' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ సినిమాకు 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు అఖిల్. ఒక పక్క ధియేటర్లకు వెళుతూ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూనే మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు.

సినిమా విడుదల అయినప్పటికీ ఇంకా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అఖిల్ ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో తన పొగతాగే అలవాటు గురించి మాట్లాడాడు. ఒకప్పుడు సిగరెట్లు చాలా ఎక్కువగా తాగే వాడినని కానీ ఈ మధ్య ఆ చెడు అలవాటును మానేశాను అని చెప్పాడు. అలానే తన ఫ్యాన్స్ ని కూడా పొగ త్రాగవద్దని, ఆరోగ్యంగా ఉండాలంటూ కోరుతున్నాడు. ఇక సినిమాల పరంగా అక్కినేని అఖిల్ తన తరువాతి ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. కొంతమంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories