‘ఏ మంత్రం వేసావె’ టాక్: సబ్జెక్ట్ ఉంది కానీ..!

Submitted by arun on Fri, 03/09/2018 - 14:38
ye mantram vesave

సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రం తర్వాత హీరో విజయ్ దేవరకొండ నటించిన ఏ మంత్రం వేసావే. వాస్తవానికి ఈ చిత్రం అర్జున్‌రెడ్డికి ముందే షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన చిత్రమిది. ఈ చిత్రానికి నిర్మాత మల్కాపురం శివకుమార్, దర్శకుడు శ్రీధర్ మర్రి. ఇంటర్నెట్, సోషల్ మీడియా వ్యసనం, మోసాలు కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మార్చి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. సినిమా చాలా నాసిరకంగా ఉందని, ప్రేక్షకుడు థియేటర్‌లో గగ్గోలు పెట్టక మానడని కొంద మంది ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే కాన్సెప్ట్ చాలా బాగుందని, కాకపోతే సినిమా నాసిరకంగా ఉండటమే మైనస్‌ని కొంత మంది ట్వీట్ చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో రెండు మూడు ట్విస్టులు, క్లైమాక్స్ బాగున్నాయని ఇంకొకరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందని అంటున్నారు. హీరోయిన్‌గా నటించిన శివాని.. ఇకపై నటించకుండా ఉంటే మంచిదని సలహాలు ఇస్తున్నారు. అయితే ఎక్కువ మంది సినిమా చాలా బోరింగ్‌గా ఉందని, దీని కన్నా షార్ట్‌ఫిల్మ్ చాలా ఉత్తమం అనే అభిప్రాయాన్నే వెల్లడిస్తున్నారు.

English Title
ye mantram vesave twitter review and public talk

MORE FROM AUTHOR

RELATED ARTICLES