వైసీపీ ‘టాస్క్‌ఫోర్స్‌’లో మోత్కుపల్లి.. రేపట్నుంచే ఆపరేషన్!

Submitted by arun on Fri, 06/15/2018 - 12:07
ycp

ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ‘ఆపరేషన్ చంద్రబాబు’ను వేగవంతం చేసింది. తెలుగుదేశం బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులును వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. హైదరాబాద్‌లో మోత్కుపల్లి ఇంటికి వచ్చిన విజయసాయి... మోత్కుపల్లితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏపీలో పర్యటిస్తానన్న మోత్కుపల్లితో విజయసాయి సమావేశం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో కూడా మోత్కుపల్లి తిరుమల పర్యటనపైనే చర్చించినట్లు తెలుస్తోంది. అయితే మోత్కుపలిని విజయసాయి మర్యాదపూర్వకంగా కలిశారంటున్న వైసీపీ.... చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎవరు ముందుకొచ్చిన కలిసి పనిచేస్తామని చెబుతోంది. చంద్రబాబుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఎలక్టోరల్ బెనిఫిట్స్ పొందాలన్న వ్యూహంలో భాగంగా ‘బాబు వ్యతిరేకుల కూటమి’ని ఏర్పాటు చేసుకుంటోంది వైసీపీ స్ట్రాటజీ టీమ్. ఇటు.. తెలంగాణ టీడీపీ నుంచి విడిపడ్డ మోత్కుపల్లి నర్సింహులు తన సీనియారిటీనంతా బాబు ప్రతిష్టను దిగజార్చడానికి ఉపయోగించాలని డిసైడ్ అయ్యారు. ఇదే అదునుగా వైసీపీ.. మోత్కుపల్లి మీదకి గాలం వేసింది. హైదరాబాద్‌లోని మోత్కుపల్లి నివాసానికి వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి.. ఆయనతో దాదాపు గంటకుపైగా ముచ్చటించారు.

‘యాంటీ చంద్రబాబు’ పాలసీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై వీళ్లిద్దరు ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విషయాలను బయటపెడుతూ చంద్రబాబును ఇరకాటంలో పడేయడానికి అన్నీ అవకాశాలను వాడుకోవాలని మోత్కుపల్లికి విజయసాయి సూచనలు ఇచ్చారు. రేపోమాపో తిరుమల వెళ్లనున్న మోత్కుపల్లి.. బాబును గద్దెదించాలన్న మొక్కుతో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలావుంటే.. తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలోవున్న జగన్‌ని కూడా మోత్కుపల్లి కలిసే ఛాన్స్ వుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

English Title
ycp mp vijayasai met former tdp leader motkupalli

MORE FROM AUTHOR

RELATED ARTICLES