ఇంగ్లాండ్‌ లక్ష్యం 233 పరుగులు

ఇంగ్లాండ్‌ లక్ష్యం 233 పరుగులు
x
Highlights

ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక తడబడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 9...

ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక తడబడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీనియర్ బ్యాట్స్‌మన్ ఏంజెలో మాథ్యూస్(85నాటౌట్: 115 బంతులో 5ఫోర్లు, సిక్స్) ఒంటరి పోరాటం చేయడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అవిష్క ఫెర్నాండో(49: 39 బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్లు), కుశాల్ మెండీస్(46: 68 బంతుల్లో 2ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 232 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్(3/52), మార్క్‌వుడ్(3/40), అదిల్ రషీద్(2/45) విజృంభించడతో లంక టపటపా వికెట్లు కోల్పోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories