సీఎం చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే భేటీ

Submitted by arun on Sat, 02/03/2018 - 16:04
babu

సీఎం చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కలవడం చర్చనీయాంశమైంది. గుంటూరులో ఒమెగా ఆసుపత్రి ప్రారంభోత్సవం నిమిత్తం అక్కడికి వెళ్లిన చంద్రబాబును, హెలిప్యాడ్ వద్ద  ముస్తఫా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముస్తఫాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అంతకుముందు, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి ఆయన కారులో ముస్తఫా అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తఫా విజయం సాధించారు. అయితే ముస్తాఫా టీడీపీలో చేరుతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ప్రస్తుతానికి తగ్గాయి. శనివారం సీఎంతో ముస్తఫా భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
 
టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ముస్తఫా చాలా చురుకుగా ఉండేవారు. ఇటీవల ఆర్టీయే అధికారులపై టీడీపీ నేతల ప్రవర్తనను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీవద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ముస్తఫా అయితే ఏకంగా గేటు ఎక్కారు. దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. గేటు దిగిన తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీలో చురుగ్గా ఉన్న ముస్తఫా చంద్రబాబుతో సమావేశం కావడం ఇప్పడు హాట్‌టాపిక్‌గా మారింది.

English Title
YCP MLA Jaleel meets with AP CM Chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES