వైసీపీలో ముసలం.. పార్టీకి రాజీనామా చేసే యోచనలో జిల్లా అధ్యక్షుడు

Submitted by nanireddy on Sun, 08/26/2018 - 17:53
ycp lo musalam

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో ముసలం మొదలైంది. గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఆయనను కాదని నియోజకవర్గంలో మరో నేతను ముందుకు తీసుకురావడమే వివాదానికి కారణమైంది. ప్రస్తుతం మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట ఇంచార్జి గా ఉన్నారు. అయితే అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళ నేత విడదల రజినీకుమారి శుక్రవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో ఆమె అలా పార్టీలో చేరిందో లేదో ఆమెను వెంటనే నియాజకవర్గ  కో ఆర్డినేటర్ గా నియమించింది అధిష్టానం. ఈ పరిణామం మర్రి రాజశేఖర్ కు రుచించలేదు. దీంతో ఇవాళ మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశమై భవిశ్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. మరోవైపు అయన వైసీపీకి రాజీనామా చేస్తారన్న వార్త ఊపందుకుంది. దీంతో వైసీపీనేతలు ఆయనతో టచ్ లోకి వచ్చారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. రాజశేఖర్ కు ఫోన్ చేసి ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దని సూచించారు.  

English Title
ycp lo musalam

MORE FROM AUTHOR

RELATED ARTICLES