2వందల కోట్ల కుంభకోణంలో వైసీపీ నేత

2వందల కోట్ల కుంభకోణంలో వైసీపీ నేత
x
Highlights

బిట్‌ కాయిన్‌ ఇటీవల కాలంలో ఈ పదం బాగా ప్రాచూర్యం పొందింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టి లక్షాధికారులు అవ్వొచ్చంటూ జనానికి కుచ్చు టోపి పెట్టేందుకు...

బిట్‌ కాయిన్‌ ఇటీవల కాలంలో ఈ పదం బాగా ప్రాచూర్యం పొందింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టి లక్షాధికారులు అవ్వొచ్చంటూ జనానికి కుచ్చు టోపి పెట్టేందుకు యత్నించాడు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం బల్లవరానికి చెందిన రామకృష్ణారెడ్డి కనిగిరిలో బిట్‌కాయిన్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రయత్నించారు. బిట్‌ కాయిన్ ఇండియా సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పేరుతో ఆఫీస్ నిర్వహించేందుకు ఓ బిల్డింగ్‌ను కూడా అద్దెకు తీసుకున్నాడు. కాల్‌సెంటర్‌లో సిబ్బంది నియామకాలకు ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు.

సైకం రామచంద్రారెడ్డి వ్యవహారాన్ని తెలుసుకున్న పోలీసులు ఆర్బీఐ నుంచి అనుమతి పత్రాలు చూపించాలంటూ కోరారు. దీంతో రామచంద్రారెడ్డి యత్నాలకు ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. కనిగిరిలో తన ప్రయత్నాలు ఫలించవని ఊహించిన రామకృష్ణారెడ్డి చెన్నైకు మకాం మార్చారు. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా బిట్‌కాయిన్‌ మోసాలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా వేల మంది నుంచి 200 కోట్లు వరకు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. రామకృష్ణారెడ్డి బాధితులు ఢిల్లీ సైబర్‌ వింగ్‌ పోలీసులతోపాటు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు బిట్‌ కాయిన్‌ పేరుతో వసూళ్లు చేసి బిచాణా ఎత్తేసిన వ్యక్తి ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన సైకం రామకృష్ణారెడ్డేనని గుర్తించారు.

వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా బిట్‌ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టించాడు రామకృష్ణారెడ్డి. అందుకు కమీషన్‌ తీసుకొని ఈ నెల మొదటి వారంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఆపేశారు. పెట్టుబడి పెట్టినవారు దీనిపై లోతుగా ఆరా తీస్తే ఇండియాలో బిట్‌ కాయిన్‌ ఆర్థిక విధానాలను కేంద్రం అనుమతించడం లేదని తెలిపాడు. ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోందని కొన్నాళ్లు ఆగాలని చెప్పి ఆ తర్వాత ఫోన్‌‌ను స్విచ్ఛాప్‌ చేశాడు. దీంతో నోయిడాకు చెందిన సుమిత్‌ అతని స్నేహితులు మోసపోయామన్న అనుమానంతో ఢిల్లీ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమీర్‌పేట ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరైన విషయం తెలియడంతో హైదరాబాద్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రామకృష్ణారెడ్డిని నిలదీసేందుకు వెళ్లిన బాధితులపై అనుచరులతో ఎదురు దాడి చేయించేందుకు రెడీ అయ్యారు. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరాది వ్యక్తులు కావడంతో వెనక్కి తగ్గి ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణా రెడ్డి వైసీపీ తమిళనాడు విభాగం సేవాదళ్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు ఉద్యోగాల పేరుతో సంస్థలు ఏర్పాటు చేసి రామకృకష్ణారెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories