నేను అక్కడినుంచి పోటీ చెయ్యను : వైసీపీ నేత బాలినేని

Submitted by nanireddy on Mon, 08/20/2018 - 16:32
ycp leader balineni srinivasareddy clarify about his contesting 2019 elections

మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు వచ్చే  ఎన్నికల్లో తన పోటీ నిర్ణయాన్ని వెల్లడించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఒంగోలు అసెంబ్లీకే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం లేదా గిద్దలూరు నుంచి బరిలోకి దిగనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో  అయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని మార్కాపురం నుంచి కాదని పునరుద్ఘాటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామన్న బాలినేని.. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. ఇక పార్టీలో చేరికల విషయంలో అధినేత జగన్ దే తుది నిర్ణయమని అన్నారు. మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీలోకి వస్తారంటే ఆహ్వానిస్తామన్నారు. 

English Title
ycp leader balineni srinivasareddy clarify about his contesting 2019 elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES