కమలం పార్టీ సీలింగ్ ఫ్యాన్ ఫ్రెండ్షిప్ ఖాయం

కమలం పార్టీ సీలింగ్ ఫ్యాన్ ఫ్రెండ్షిప్ ఖాయం
x
Highlights

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసిన సూచనలు కనిపిస్తున్నాయి....

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసిన సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఈ సారి వైసీపీతో దోస్తీ కట్టి బరిలోకి దిగనుందా? ఆ పార్టీ నేతల మాటలు, చేతలు చూస్తుంటే కమలం పార్టీ సీలింగ్ ఫ్యాన్ ఫ్రెండ్షిప్ ఖాయమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమని వైఎస్ జగన్ జాతీయ మీడియా సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ఇరు పార్టీల మధ్య పొత్తుపై చర్చ కూడా జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇరు పార్టీల్లోని నేతలెవరూ ఈ విషయంపై వ్యాఖ్యానించలేదు. దీంతో ఈ విషయం అక్కడితో ముగిసినట్టుగా అందరూ భావించారు. అయితే మరో ఆసక్తికర సన్నివేశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి.. పక్కనే కూర్చుని ప్రెస్‌మీట్ నిర్వహించారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి మంత్రులుగా ఉన్న వారు రాజీనామా చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేయడం విశేషం. లేకపోతే పార్టీ ఫిరాయించిన వారు మంత్రులు కావచ్చనే చట్టాన్ని తేవాలని విష్ణుకుమార్ రాజు చురకలంటించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ మారి మంత్రులైన వారు రాజీనామా చేయాలన్న వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే తాను చెప్పింది నిజమని తేలుతుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఇలాంటి తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు వైసీపీకి అనుకూలంగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏదేమైనా ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories