"మీ విజయానికి ఆశ మరియు ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యమే"

మీ విజయానికి ఆశ మరియు ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యమే
x
Highlights

ఫ్రండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం.... "మీ విజయానికి ఆశ మరియు ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యమే" ఒక మనిషి తన జీవితంలో విజేతగా నిలబడటానికి...

ఫ్రండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం.... "మీ విజయానికి ఆశ మరియు ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యమే"

ఒక మనిషి తన జీవితంలో విజేతగా నిలబడటానికి సహాయపడేవాటిలో అత్యంత ముఖ్యమైనవి ఆశ మరియు ఆత్మవిశ్వాసం. తన భవిషత్తుపై ఆశ మరియు తనపై తనకు ఆత్మవిశ్వాసం వుండటం చాల ముఖ్యం. అయితే నేటి కన్నా రేపు బాగుంటుందన్న ఆశ, అలాగే నిన్నటికన్నా నేడు తాను మెరుగయ్యాననే ఆత్మవిశ్వాసం, ఒక మనిషికి తన కృషిలో, తన విజయంలో ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా మనం గుర్తుకువుంచుకోవల్సింది..మనం ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న కూడా, సరైన ప్రణాళికతో, కొంత కృషితో మన పరిస్థితులను మనం మెరుగుపరుచుకోవచ్చు.

ఒక వ్యక్తి ప్రస్తుతం కారుచీకట్లో వున్నా కూడా, కొంతకాలం తర్వాత తన జీవితంలో వెలుగు రేఖలు వస్తాయని ఆశతో, భవిష్యత్తుకు సంబందిచిన విషయాలలో ఆత్మవిశ్వాసంతో, తను ఒక్కో అడుగు జాగ్రత్తగా ముందుకు వేస్తువుంటే..ఆ వ్యక్తి తప్పక సుర్యోదయం చూస్తాడు, తన జీవితంలో వెలుగును చూస్తాడు, తన చుట్టూ వున్నా తన వారి ముఖంలో చిరునవ్వులు చూడగలరు.

కాబట్టి ప్రస్తుతం మన చుట్టూ ఎంత చీకటి వున్నా, ఆ చీకటిని తొలగించుకోడానికి, మనం వెలిగించే ఒక చిన్న దీపం, ఎలా వెలుగుని మనకి అందించగలుగుతుందో..అలాగే ఎన్ని సమస్యల మద్య మనము వున్న కూడా... ఒక చిన్న ఆశ మనకి వుంటే చాలు, ఆ చిన్న ఆశనే...మనం సమస్యల సునామిని కూడా ఇట్టే దాటేసెల మనకి సహాయపడుతుంది, కాబట్టి మన సమస్యలు అన్ని త్వరలోనే తోలుగుతాయని మనం ఆశించటం, మన విజయపు బాటలో తొలిమెట్టుగా అవుతుంది.

అలా విజయపు బాటలో తొలిమెట్టు కావాలంటే, మనం కోరుకునే చక్కని జీవితం, ఇష్టమైన జీవితం పొందాలనుకుంటే, పొందుతామనే ఆశని మనమే పెంచుకోవాలి, ఆ ఆశని చివరి వరకు బ్రతికిన్చుకోవాలి. అయితే జీవితంలో ఎంత పెద్ద అనారోగ్యం వున్నా వ్యక్తికైనా.. తన భవిషత్తుపై చిగురంత ఆశ వున్నా, అది కొండంత వెలుగుని ప్రసాదిస్తుంది, ఆ చిన్న ఆశ వుంటే చాలు..ఆ పెద్ద సమస్యని కూడ సులభంగా తానూ ఎదుర్కోగలడు. కానీ అదే మనిషికి తన భవిష్యత్ మీద, తన మనస్సులోనే ఒక అనుమానం అనే బీజం పడితే, భవిషత్తు విషయంలో నిరాశ తో నిండివుంటే..ఆ వ్యక్తి యొక్క చిన్న అజీర్తి కూడా పెద్ద సమస్యగా మార్చగలదట.

అందుకే ఇలాంటి సమయంలో, ఇలాంటి కష్టకాలంలో, ఇలాంటి సంక్లిష్ట సమయంలో, ఒక వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసం, అతనికి ఒక గొప్పఆయుధంగా ఉపయోగపడుతుంది. చిమ్మ చీకటిలో వెలుగు రేఖ లా దారి చూపెడుతుంది, ఎడారిలో కొబ్బరి నీరులా సహాయపడుతుంది, ఆపదలో కాపాడే అపద్బందువులా నిలబడుతుంది. కాబట్టి తన మీద తనకి ఆత్మవిశ్వాసంలేని వ్యక్తి, తన జీవితంలో ఎ పెద్ద లక్ష్యాలని పెట్టుకోలేడు, అలా పెట్టుకున్న వాటిని సాధించలేడు. ఒక కారు నడవడానికి పెట్రోల్ ఎంత అవసరమో, అలాగే మనిషి జీవితంలో ముందుకు విజయవంతంగా నడవాలంటే తనపై తనకు ఆత్మవిశ్వాసం చాల అవసరం. మన ఎన్నో అనవసర భయాలను జయించటానికి, వాటిని దాటి ముందుకు వెళ్ళటానికి మనకి అచంచలమైన ఆత్మవిశ్వాసం అవసరం.

ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి ఎన్నో పనులను ఆలోచించలేడు, ఉహించలేడు, అసలు కొత్త పనులను మొదలుపెట్టడానికి కూడా ధైర్యం చెయ్యలేడు. తన జీవితంలో ఈ ఒక్క ఆత్మవిశ్వాసం లేక పోవడం వలన ఎన్నో పరిస్థితుల్లో తడబడతాడు, ఇబ్బందిపడుతాడు, ఆందోళన చెందుతాడు. ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి సరైన దారి ఆత్మ విశ్వాసం పెంచుకోవడమే. ఎప్పుడైతే మీకు మీపై ఆత్మవిశ్వాసం వున్నపుడు మీరు కొన్ని పనులు చేపట్టడానికి, కొత్త చర్యలు తీసుకోవడానికి, కొత్తగా ఆలోచించడానికి ఎక్కువగా అవకాశం వుంటుంది అని గుర్తించాలి. అలాగే

మీకు కావలసిన దాని గురుంచి ఆ సమయలో మీరు నిలబడగలరు మరియు ఆ క్షణాలను పూర్తిగా మీ స్వాధీనంలో, ఆధీనంలో వుంచుకోగలరు.

అయితే కొన్ని సార్లు ఇతరులు మీ లక్ష్యాన్ని మీరు సాధించటం పై అనుమానాలు వ్యక్తం చేసిన కూడా, మీకు ఆత్మవిశ్వాసం వుండటం వల్ల చివరివరకు పోరాటం చేసి నిలబడగలరు, అలాగే మీ లక్ష్యాన్ని సాధించి ఒక విజేతగా నిలబడలగలరు. మరి అలాంటి ఆశని, ఆత్మ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మొదటిది.....అందమైన భవిష్యత్తు ను ఉహించండి: మీ జీవితంలో చిగురంత ఆశ చిగురించటానికి మీరు కోరుకునే లక్ష్యాలు, ఒక్కోటి అవుతున్నట్టు ఉహించండి, మీ భవిషత్తు విషయమలో మీరు కోరుకునే ఒక్కో అంశం సాదిస్తున్నట్టు, ఆ సమయంలో మీరు పూర్తి ఆనందం పొందుతున్నట్టు మీ మనస్సు లో చూడండి, వినండి, ఫీల్ కండి. ఎప్పుడైతే మీ మనస్సులో ఇలా చూడగలుగుతారో మీలో కొంత ఆశ పెరుగుతుంది.

రెండవది ... రోజు కొంచెం సాదన చెయ్యండి: మీపై మీకు మీరు కోరుకున్న విషయంలో ఆత్మ విశ్వాసం పెరగటానికి, దానికి సంబంధించిన రోజు వారి సాధన ఎంతో సహాయపడుతుంది, మీరు ఎంచుకున్న విషయంలో రోజు వారి సాధన చేస్తువుండటం వలన అత్యంత సహజంగా మీ ఆత్మ విశ్వాసం పెరగటం మొదలవుతుంది. సో ఫ్రండ్స్ ఇలా మనం ఇప్పటివరకు చర్చించిన విషయాలను మీరు ఆచరణలో పెట్టడం ద్వార మీ భవిష్యత్తు పైన ఆశని పెంచుకోవచ్చు, మీ పైన ఆత్మ విశ్వాసం పెంచుకోవచ్చు. అల్ ది బెస్ట్. శ్రీ.కో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories