చైనాలో.. రాచరికానికి నాంది!

చైనాలో.. రాచరికానికి నాంది!
x
Highlights

చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన అధ్యక్షుడు జిన్ పింగ్.. తన అధికారాన్ని మరింత పదిలం చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓ వ్యక్తి రెండేసార్లు...

చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన అధ్యక్షుడు జిన్ పింగ్.. తన అధికారాన్ని మరింత పదిలం చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓ వ్యక్తి రెండేసార్లు పోటీ చేయాలన్న నిబంధనను.. తొలగింపజేయడంలో ఆయన విజయం సాధించారు. గడచిన ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టి నెలలోపే అనుకున్న పూర్తి చేయించారు. దీంతో.. జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆయనకు అనుకూలత ఏర్పడింది.

వాస్తవానికి.. గతంలో రెండు సార్లే పోటీ చేయాలన్న నిబంధన చైనాలో లేదు. 1982లో చట్టాన్ని సవరించి.. ఈ నిబంధనను అమల్లోకి తెచ్చారు. 36 ఏళ్ల పాటు.. అది సక్సెస్ ఫుల్ గా అమల్లోనే ఉంది. కానీ.. గత ఏడాది జిన్ పింగ్.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత.. తానే అధ్యక్షుడిగా కొనసాగాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా పాచికలు వేశారు.

జిన్ పింగ్ చర్యలు ఫలించాయి. 36 ఏళ్లుగా ఉన్న నిబంధనను చైనా కాంగ్రెస్ తొలగించింది. అధికార వ్యవస్థలో చైనాలో కీలకమైన పొలిట్ బ్యూరో కూడా ఆమోదించింది. తర్వాత.. నామమాత్రమైన కాంగ్రెస్ ఓటింగ్ లో కూడా.. ఈ ప్రతిపాదన విజయం సాధించింది. అన్ని దశలనూ దాటడంతో.. చట్ట సవరణ కూడా పూర్తయిపోయింది. దీంతో.. జిన్ పింగ్ మరింత శక్తివంతమైన నేతగా అవతరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories