'సీఎం కుమారస్వామి కొడుకుతో పెళ్లి' వార్తలపై స్పందించిన అమ్మాయి తండ్రి

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 11:49
wrong news about karnataka-cm-kumarswamy-daughter-in-law

ఇటీవల దుర్గాదేవి దర్శనార్ధం విజయవాడకు వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి… కనక దుర్గ అమ్మవారిని దర్శించుకోవడం తో పాటు… ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావు ఇంటిలో భోజనం చేశారు.  దాంతో కొడుకు పెళ్లి విషయం మాట్లాడేందుకే కుమారస్వామి కోటేశ్వరావు ఇంటికి వచ్చారని వార్తలు వచ్చాయి. 

అయితే వాటిని అమ్మాయి తండ్రి కోటేశ్వరరావు ఖండించారు. 'కుమారస్వామి మాకు ఆప్తమిత్రుడు. ఎంతో కాలం నుంచి ఇరు కుటుంబాలు స్నేహబంధం తో మేలిగాయి. విజయవాడ వస్తే మా ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాను. అంతే తప్ప ఇందులో పెళ్లి విశేషం అంటూ లేదు' అని కోటేశ్వరరావు స్పష్టం చేశారు.

English Title
wrong news about karnataka-cm-kumarswamy-daughter-in-law

MORE FROM AUTHOR

RELATED ARTICLES