స్పైసీ వెల్లుల్లి రసం తయారీ విధానం

స్పైసీ వెల్లుల్లి రసం తయారీ విధానం
x
Highlights

కావాల్సిన పదార్ధాలు : రెండు టమాటాలు 20 వెల్లుల్లి రెబ్బలు కొంచం చింతపండు పప్పు నీళ్లు ఒక కప్పు కరివేపాకు ఆవాలు ఇంగువ దనియాలు జీలకర్ర ...

కావాల్సిన పదార్ధాలు :

రెండు టమాటాలు

20 వెల్లుల్లి రెబ్బలు

కొంచం చింతపండు

పప్పు నీళ్లు ఒక కప్పు

కరివేపాకు

ఆవాలు

ఇంగువ

దనియాలు

జీలకర్ర

మిరియాలు

ఎండుమిర్చి

నూనె

ఉప్పు కొత్తిమీర

తయారీ విధానం

ముందుగా దనియాలు, జీలకర్ర,,మిరియాలు, ఎండు మిర్చిని ఫ్రై చేసుకోకుండానే మిక్సీలో వేసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి.

స్టవ్ ఆన్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. తరువాత ఆవాలు , ఇంగువ ,కరివేపాకు , వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసేప్పుడు డైరెక్ట్ వేయకుండా రెబ్బలను చిదిమి వేసుకోవాలి. అలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. రసం ఎంత మొత్తంలో కావాలో దానిని బట్టి చింతపండు రసాన్ని తీసుకోండి..ఇఫ్పుడు పప్పు నీరు వేసుకోవాలి... ఆల్‌రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి. రెండు స్పూన్‌ల పొడిని వేసుకోవాలి. ఈ రసం డిఫరెంట్ టేస్ట్‌లో ఉంటుంది. ఇందులో ఉప్పు వేసుకోవాలి.. కొంచం సేపు మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద రసాన్ని బాగా మరిగించాలి. రసం బాగా మరిగిన తరువాత కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి...స్పైసీ వెల్లుల్లి రసం రెడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories