షూటింగ్ మొదలుపెట్టిన లేడీ సూపర్ స్టార్

షూటింగ్ మొదలుపెట్టిన లేడీ సూపర్ స్టార్
x
Highlights

ఈమధ్యనే 'పెట్ట' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజినీకాంత్ ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ...

ఈమధ్యనే 'పెట్ట' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజినీకాంత్ ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'దర్బార్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఓ వారం నుండి ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతూ ఉంది. ఈ సినిమా షూటింగ్ లో రజినీకాంత్ మొదటి షెడ్యూల్ నుండే యాక్టీవ్ గా పాల్గొంటున్నారు. తాజాగా హీరోయిన్ నయనతార కూడా ఈ సినిమా షూటింగ్ లో ఇవాళే జాయిన్ అయింది.

ఇవాళ్టి నుండి ఈ సినిమా షూటింగ్ లో నయనతార కూడా జాయిన్ అయింది. ఈ సినిమా లో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. నయనతార పాత్ర గురించి ఎటువంటి అప్డేట్లు ఇంకా వెలువడలేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేయనున్నారు. 'దళపతి' సినిమా తరువాత మళ్ళీ 28 ఏళ్లకు రజిని తో కలిసి పనిచేయబోతున్నారు సంతోష్ శివన్. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories