ఆ సరదా ప్రాణాన్ని తీస్తోంది...ఒక ట్రెండ్ లైఫ్ ని ఎండ్ చేస్తోంది

ఆ సరదా ప్రాణాన్ని తీస్తోంది...ఒక ట్రెండ్ లైఫ్ ని ఎండ్ చేస్తోంది
x
Highlights

పుట్టిన రోజు అంటే ఒకప్పుడుఏ గుడికి వెళ్లాలని ఆలోచించేవారు, ఇంకొందరు ఫ్యామలీతో ఏ హోటల్‌కు వెళదాం అని ఆరాతీసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పుట్టిన...

పుట్టిన రోజు అంటే ఒకప్పుడుఏ గుడికి వెళ్లాలని ఆలోచించేవారు, ఇంకొందరు ఫ్యామలీతో ఏ హోటల్‌కు వెళదాం అని ఆరాతీసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పుట్టిన రోజు వేడుకలు ఫ్యామలీ సభ్యులతో చేసుకోవడం మానేసారు యువత. పుట్టినరోజు అంటే ఫెండ్స్ తో జరుపుకోవాలి ఫుల్ గా ఎంజాయ్ చేయాలి సంవత్సరం మొత్తం గుర్తుండిపోవాలి ఇలానే ఆలోచిస్తున్నారు నేటి యువత. అయితే ఈ ఆలోచనే వారి ప్రాణాల మీదకు తెస్తోంది బర్త్ డే రోజును డెత్‌డే గా మారుస్తోంది. ఆనందంగా జరుపుకోవాల్సిన రోజును విషాదంతో ముగిస్తోంది.

పుట్టిన రోజు అంటే ఏదో కొత్తగా చేయాలి ఫుల్ ఎంజాయ్ చేయాలి ఈ ఆలోచనే కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపుతోంది బర్త్ డేను డెత్‌ డేగా మారుస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో బైక్ రేసింగ్ ముగ్గురి ప్రాణాలను తీసింది. శ్రీకాకుళం జిల్లా గారపేట మండలం చల్లపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణలో పోలీసులు ఆసక్తికర విషయాలను తెలుసుకొన్నారు.

ఈ నెల 8వ తేదీన హిమశేఖర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బైక్ రేసింగ్ నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణం నుంచి కళింగపట్నానికి ఎవరు ముందుగా చేరుకుంటారో పందెం కాసి జెట్‌ వేగంతో మూడు బైక్స్‌పై దూసుకెళ్లారు. ఈ బైక్ రేసులో హిమ శేఖర్ తో పాటు ఆయన స్నేహితుడు తేజ మరణించారు. వీరిద్దరితో పాటు కూరగాయల వ్యాపారి దామోదర శ్రీనివాస్ కూడ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. హిమశేఖర్ స్నేహితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సుమారు ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆనందంగా జరుపుకోవాల్సిన పుట్టిన రోజు వేడుకలు ఈ మధ్య విషాదంతో ముగుస్తున్నాయి కొత్త కొత్తగ పుట్టుకొస్తున్న ట్రెండ్స్ యువతను బలితీసుకుంటున్నాయి వారి ఫ్యామలీకి శోకాన్ని మిగిలిస్తున్నాయి. సరదాగా చేసుకోవాల్సిన బర్త్‌డే పార్టీలు కాస్త శోకాన్ని మిగుల్చుతున్నాయి. సోషల్ మీడియాలో మనం వీడియోలు చూస్తూనే ఉంటాం. బర్త్‌డే వేడుకల్లో కేకులు పూయడం, స్ప్రేలు కొట్టడం, ఇంకేదో చేయడం దీని వల్ల బర్త్‌డే చేసుకునేవాళ్లకు ప్రమాదమే తప్పితే వచ్చేదేమీ ఉండదు. వీటన్నిటిలో నయా ట్రెండ్ బర్త్‌డే బంప్స్.

యువత ప్రాణాలు తీస్తున్న మరో సరదా బర్త్‌డే బంప్స్ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకునే సమయంలో పుట్టిన రోజు ఎవరిదైతే ఉంటుందో వాళ్లకు చేసేదే ఈ బర్త్‌డే బంప్స్. బర్త్‌డే బాయ్ రెండు కాళ్లు, రెండు చేతులు పట్టుకొని పైకి లేపి కింది నుంచి తన్నడమే దీని స్పెషాలిటీ. ఇటీవల బర్త్‌డే బంప్స్ పేరుతో ఐఐఎమ్ విద్యార్థిని తీవ్రంగా కొట్టారు అతడి ఫ్రెండ్స్. పిడి గుద్దులు గుద్దారు. డొక్క మీద తన్నారు. దీంతో అతడికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో పాటు అతడి క్లోమ గ్రంథి దెబ్బతిన్నది. దీంతో అతడికి చికిత్స అందిస్తుండగానే ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. తన ఫ్రెండ్స్ బర్త్‌డే బంప్స్ పేరుతో అతడిపై కొట్టిన వీడియో కూడా అప్పట్లో వైరల్ అయ్యింది.

బర్తడే రేడ్, బర్డడే బంప్స్ మాత్రమే కాదు ఇటీవల పుట్టిన రోజు సరదా ఎంతో మంది ప్రాణాలను తీసింది ఇలా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది 15 నుంచి 25 సంవత్సరాల లోపు యువతే ఉండటం ఆందోళన కలిగిస్తోంది స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లి కొందరు సెల్ఫీలు తీసుకుంటూ మరికొందరు ఇలా ఎంతో మంది పుట్టిన రోజు నాడు మృత్యువాత పడుతున్నారు.

పుట్టినరోజు ఆనందంగా జరుపుకోవడం మంచిదేకానీ కానీ అది సృతి మించకూడదు బర్త్ డే సెలబ్రేషన్స్ ఆహ్లాదకరంగా ఉండాలి కానీ ప్రాణం తీసేలా కాదు ఏదైనా ట్రెండ్స్ అనేది సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలి కాని అస్పృశ్యతను కలిగించే విధంగా ఉండకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories