బెజవాడలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

Submitted by arun on Thu, 06/21/2018 - 16:39

విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో వ్యభిచారకూపం గుట్టు రట్టైంది. యువతులను ట్రాప్ చేసి.. వ్యభిచారకూపంలోకి దించుతున్న శోభారాణి అనే మహిళ బండారం బయటపడింది. ఏడాది క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ యువతికి.. పని ఇప్పిస్తానని చెప్పి ఓ ఆటో డ్రైవర్ ఆమెను వ్యభిచారగృహానికి 20 వేలకు అమ్మేశాడు. అలా.. ఏడాదిగా ఆ యువతి నరకం అనుభవిస్తోంది. ఇప్పుడు స్థానికుల సాయంతో.. వ్యభిచారకూపం నుంచి బయటపడింది.

శోభారాణి అనే మహిళ చాలాకాలంగా.. ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచారగృహం నడుపుతోంది. అలా.. చాలా మంది యువతులను ట్రాప్ చేసి.. వారిని వ్యభిచారకూపంలోకి దించి వారి జీవితాలను నాశనం చేసింది. ఆవిడపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వాళ్లు పట్టించుకోవడం లేదని వాపోతోంది బాధితురాలు. పోలీసులు శోభారాణి నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తోంది.

బాధితురాలికి తల్లీ,తండ్రి చనిపోవడంతో.. పెదనాన్న ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ప్రయత్నించడంతో ఇంటినుంచి పారిపోయి విజయవాడకు వచ్చింది. అలా.. బస్టాండ్‌లో ఆటో డ్రైవర్ ట్రాప్‌లో పడి మోసపోయింది. చివరికి.. స్థానికులు యువతిని కాపాడారు. యువతుల జీవితాలను నాశనం చేస్తున్న.. శోభారాణిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

English Title
women rescued young lady sex racket

MORE FROM AUTHOR

RELATED ARTICLES