ఆమె చీరతో.. ఆమెకే ఉరి వేశారు.. ఆ తర్వాత కాళ్లను నరికేశారు..

ఆమె చీరతో.. ఆమెకే ఉరి వేశారు.. ఆ తర్వాత కాళ్లను నరికేశారు..
x
Highlights

ఆమె చీరతో.. ఆమెకే ఉరి వేశారు.. ఆ తర్వాత కాళ్లను నరికేశారు.. వాటిని తీసుకెళ్లి పక్కనే ఉన్న బిల్డింగ్ టెర్రస్‌పై పడేశారు. ఈ భయానక మర్డర్ జరిగింది ఎక్కడో...

ఆమె చీరతో.. ఆమెకే ఉరి వేశారు.. ఆ తర్వాత కాళ్లను నరికేశారు.. వాటిని తీసుకెళ్లి పక్కనే ఉన్న బిల్డింగ్ టెర్రస్‌పై పడేశారు. ఈ భయానక మర్డర్ జరిగింది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. అది కూడా.. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ప్రాంగణంలోనే. మానసిక రోగులకు చికిత్స జరగాల్సిన చోట.. మర్డర్ ఎందుకు జరిగింది.?

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మేల్ వార్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో.. జులాయి వెధవలు పేకాట, మందు తాగడం వంటివి చేస్తున్నారు. ఇందుకు అక్కడ పడి ఉన్న ఖాళీ మందుసీసాలే నిదర్శనం. చాలా రోజుల నుంచి ఇది జరుగుతున్నా.. ఆస్పత్రి సిబ్బంది గానీ, అధికారులు గానీ పట్టించుకోలేదు. తాజాగా అక్కడ జరిగిన మహిళ హత్య.. ఇప్పుడు కలకలం రేపుతోంది. ముందుగా మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బుధవారం రాత్రి ఈ మర్డర్ జరిగినట్లు తెలుస్తోంది. అక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. మహిళను దారుణంగా హతమార్చారు దుండగులు. ఆమె చీరతో ఆమెకే.. ఉరివేసి చంపేసిన తర్వాత.. మహిళ కాళ్లను కూడా నరికేసి.. మేల్ వార్డు బిల్డింగ్ టెర్రస్‌పై పడేశారు.
ఈ కేసుకు సంబంధించి.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే.. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. హత్యకు గురైన మహిళను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఆస్పత్రి సిబ్బందిని, చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. హత్య చేసిన దుండగుల కోసం గాలిస్తున్నారు.

హత్య చేసిన తర్వాత.. మహిళ కాళ్లు నరికేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాళ్లకు ఉండే కడియాల కోసమే హత్య చేశారా.. అన్న అనుమానం రేకెత్తుతోంది. కల్లు కాంపౌండ్‌లకు వచ్చే ఒంటరి మహిళలే టార్గెట్‌గా.. కడియాలు కొట్టేసే బ్యాచ్ రెచ్చిపోతుంటుంది. కాళ్ల నుంచి కడియాలు రాకపోతే.. కాళ్లు నరికేసి మరీ తీసుకెళ్లేంత క్రూరంగా వాళ్లు వ్యవహరిస్తారు. ఈ ఘటన జరిగిన తీరు చూస్తుంటే.. మహిళను హత్య చేసింది వాళ్లేనేమోనన్న అనుమానం కలుగుతోంది. కానీ.. హత్యకు గురైన మహిళ ఎవరో తెలిస్తే గానీ.. కేసు కొలిక్కి వచ్చే చాన్స్ లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories