చేతులు శుభ్రం చేసుకోక..మహిళ మృతి

Submitted by nanireddy on Fri, 08/17/2018 - 18:05
women-died-negligence

వ్యవసాయ పొలానికి పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలంలోని చంద్రశేఖర్‌నగర్‌ కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన చిన్న రామన్న తన వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంటకు ఎలుకల బెడద ఎక్కువ కావడంతో రామన్న భార్య ముణెమ్మ(51) గుళికల మందు పిచికారీ చేసింది. కానీ చేతులు మాత్రం శుభ్రంగా కడుక్కోలేదు.పైగా రాత్రిపూట అలాగే భోజనం చేయడంతో అస్వస్థతకు గురైంది. వెంటనే  కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించగా నిన్న(గురువారం) ఉదయం మృతిచెందింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేపట్టారు. 

English Title
women-died-negligence

MORE FROM AUTHOR

RELATED ARTICLES